చిరంజీవి, రజనీ, కమల్, అంబి ఒకే వేదికపైకి...(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: సౌతిండియాలో పాపులర్ స్టార్స్‌గా పేరొందిన తమిళ నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, తెలుగు స్టార్ చిరంజీవి, కన్నడ నటుడు అంబరీష్, మరికొందరు పాపులర్ సెలబ్రిటీలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వేడుక ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ వందేళ్ల సినిమా వేడుకలో సౌతిండియాలోని ఫిల్మ్ ఇండస్ట్రీలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం నటులు పాల్గొనబోతున్నారు. ఈ మేరకు సౌతిండియా ఫిల్మ్ ఛాంబర్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏప్రిల్ 26 నుంచి 28న మధ్య ఈ కార్యక్రమం నిర్వహించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫీస్ బేరర్స్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఈ వేడుక జరుపడం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫైనల్ ప్రకటన వెలువడనుంది. ఈ ఈవెంట్ కు సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోని బిగ్ షాట్స్ అంతా హాజరు కానున్నారు.
సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ ఈ విషయమై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ...'ఇండియన్ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో ప్రముఖంగా సేవలు అందించిన వారికి అవార్డుల ప్రధానోత్సవం చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఏప్రిల్ 26 నుంచి 28 మధ్య ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' అన్నారు.
మిగతా వివరాలు స్లైడ్ షోలో...

మూడు రోజుల పాటు గ్రాండ్ గా జరిగే ఈ వేడుకలో సౌతిండియా సీని ప్రముఖులు తమ ఆట పాటలతో అలరించనున్నారు.

చెన్నైలోని జవహర్ లాల్ ఇండోర్ స్టేడియం ఇందుకు వేదిక చేయాలనే ఆలోచనలోఉన్నారు. ఈ మేరకు తమిళనాడు సీఎం జయలలితను అనుమతి కోసం కలవనున్నారు.

ఒక వేళ అక్కడ కాకుంటే సెకండ్ ఆప్షన్ గా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీని ఇందుకు వేదికగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రముఖులకు భద్రత ఏర్పాట్లు చేయడానికి వీలుంటుంది.

త్వరలో ఈ ఈవెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

గతంలో కన్నడ నటుడు అంబరీస్ 60వ పుట్టినరోజు వేడుక సందర్భంగా సనీ బిగ్ షాట్స్ అంతా ఒకే వేదికపైకి వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











