అంబరీష్ మృతదేహాన్ని చూసి రజనీ కంటతడి, చిరంజీవి భావోద్వేగం, సుమలతకు ఓదార్పు!
Recommended Video

ప్రముఖ కన్నడ నటుడు, సాండల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ మరణం సౌత్ సినీ ప్రముఖులను విషాదంలో ముంచెత్తింది. అంబి ఇక లేరు అనే విషయం తెలియగానే సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు సౌత్ సినీ ప్రముఖులు బెంగుళూరు చేరుకున్నారు.
తన ఆప్తమిత్రుడు మరణించిన విషయాన్ని రజనీకాంత్, చిరంజీవి జీర్ణించుకోలేకపోతున్నారు. అంబరీష్ మృతదేహాన్ని చూడగానే ఇద్దరూ భావోద్వేగాలను ఆపుకోలేక పోయారు. కన్నడిగులకు మాత్రమే కాదు.... ఇతర ఇండస్ట్రీకలు చెందిన నటులకూడా ఎంతో ఆప్తుడిగా అంబరీష్ పేరు తెచ్చుకున్నారు.

కంటతడి పెట్టిన రజనీకాంత్
అంబరీష్ మరణవార్త రాత్రే తెలుసుకున్న రజనీకాంత్ వెంటనే చెన్నై నుంచి బెంగుళూరు చేరుకున్నారు. అంబి భౌతిక కాయాన్ని చూడగానే రజనీకి కన్నీరు ఆగలేదు. అంబరీస్ గొప్ప మనసున్న వ్యక్తి, నా స్నేహితుడు నాకు దూరమయ్యాడు. ఇక ముందు నీవు లేవన్న విషయంతో దు:ఖంలో మునిగిపోయాను ట్వీట్ చేశారు.
చిరంజీవి భావోద్వేగం
సైరా షూటింగ్ కేన్సిల్ చేసుకుని మెగాస్టార్ చిరంజీవి బెంగుళూరు చేరుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన అంబరీష్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యారు. తన సహ నటి, అంబి భార్య సుమలతను మెగాస్టార్ ఓదార్చారు.
మోహన్ బాబు కంటతడి
తన ప్రాణ మిత్రుడు అంబరీష్ భౌతిక కాయం వద్ద మోహన్ బాబు కంటతడి.
విషాదంలో కన్నడ ఇండస్ట్రీ
అంబరీష్ మరణంతో కన్నడ సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న అంబరీష్ లేని లోటు తీర్చలేనిదని, పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి పరిష్కరించే వారని వారు గుర్తు చేసుకుంటున్నారు.
అర్జున్ సార్జా
అంబరీష్ మృతదేహం వద్ద కంటతడి పెడుతున్న అర్జున్ సార్జా.
మాండ్యాలో అంత్యక్రియలు
అంబరీష్ అంత్రక్రియలు మాండ్యాలో సోమవారం జరుగనున్నాయి. ఆయన భౌతిక కాాయాన్ని మిలటరీ హెలికాప్టర్లో మాండ్య తరలించారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
అధికారిక లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలు నిర్వహించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు అంబరీష్ చివరి చూపుకోసం తరలి వస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో అంబి భౌతిక కాయాన్ని ఉంచారు.


Click it and Unblock the Notifications











