twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్‌కి రజనీ, చిరు, జయ మద్దతు...క్షమాబిక్షతో బయటికి?

    By Bojja Kumar
    |

    చెన్నై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన నేపథ్యంలో యావత్ సినీ లోకమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సంజయ్ దత్‌కి జైలు శిక్ష పడటంపై స్పందించారు.

    శుక్రవారం రజనీకాంత్ చెన్నైలో మీడియాకు ప్రెస్ స్టేట్ మెంట్ విడుదల చేసారు. సంజయ్ దత్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంజయ్ దత్ జైలుకెలుతున్నారనే వార్త తనను బాధించిందని వ్యాక్యానించారు. సంజయ్ దత్ తనకెంతో సన్నిహితుడని, ఎంతో మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఇలా జరుగడం విచారించదగ్గ విషయం అని, అతనికి అంతా మంచి జరుగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రజనీ వెల్లడించారు.

    మరో వైపు మెగా స్టార్ చిరంజీవి ఈ విషయమై ఢిల్లీలో స్పందించారు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెడితే మంచిదేనని చిరంజీవి అన్నారు. ఆయనకు క్షమాభిక్ష పెడితే తాను సంతోషిస్తానని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు అంతిమమైనా తాను క్షమాభిక్ష పెట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు.

    ఇదిలా ఉంటే రాజ్యసభ ఎంపీ, నటి జయ బచ్చన్ ఈ రోజు మాట్లాడుతూ సంజయ్ దత్‌ని జైలు శిక్ష నుంచి తప్పించేలా క్షమాబిక్ష మహారాష్ట్ర గవర్నర్ ను కోరనున్నట్లు వెల్లడించారు. సంజయ్ కి జైలు శిక్ష నుంచి ఊరట కల్పించే అధికారం మహారాష్ట్ర గవర్నర్ కు ఉందని ఆ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు చూస్తుంటే సినీ లోకం మద్దతు, ప్రభుత్వం సహకారం కలగలిస్తే సంజయ్ కి క్షమాబిక్ష లభించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

    సంజయ్‌కి రజనీ, చిరు, జయ మద్దతు... క్షమాబిక్షతో బయటికి?

    రజనీకాంత్ తో సంజయ్ దత్.

    సంజయ్‌కి రజనీ, చిరు, జయ మద్దతు... క్షమాబిక్షతో బయటికి?

    సంజయ్ దత్, జయ్రపద, చిరంజీవి తదితరులు.

    సంజయ్‌కి రజనీ, చిరు, జయ మద్దతు... క్షమాబిక్షతో బయటికి?

    అమితాబ్ ఫ్యామిలీతో సంజయ్ దత్.

    సంజయ్‌కి రజనీ, చిరు, జయ మద్దతు... క్షమాబిక్షతో బయటికి?

    భార్యతో సంజయ్ దత్.

    కేసు వివరాల్లోకి వెళితే.. 1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్‌కి సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఇప్పటికే పద్దెనిమిది నెలల జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్న సంజయ్‌ని నాలుగు వారాల్లో కోర్టులో లొంగి పోవాల్సిందిగా కోర్టు గురువారం ఆదేశించింది. దీంతో ఆయన మిగిలిన మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

    English summary
    Rajinikanth and Chiranjeevi supports Sanjay Dutt. Superstar Rajinikanth himself has sent a press statement supporting the actor. Actor Jaya Bachchan, who is a member of Rajya Sabha, said she would meet the governor of Maharashtra state to plead for Dutt's cause.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X