మెమోరియల్ నైట్‌లో రజనీకాంత్, చిరంజీవి
హైదరాబాద్: ప్రముఖ సౌతిండియా యాక్టర్లు రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి ఇతర నటీనటులు శనివారం రాత్రి బెంగుళూరులో జరిగే కన్నడ స్టార్ రాజ్ కుమార్ మెమోరియల్ ఎంటర్టెన్మెంట్ నైట్‌కి హాజరు కాబోతున్నారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఇందుక సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఆ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఆర్.రోషన్ బేగ్ పోలీసులతో సమావేశమై భద్రత అంశాలపై చర్చించారు. దాదాపు లక్ష మందికి పైగా రాజ్ కుమార్ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరువుతారని అంచనా.

ఇన్విటేషన్లో అమితాబ్ బచ్చన్ కూడా హాజరవుతున్నట్లు ఉంది. అయితే ఆయన రాక ఇంకా ఖరారు కాలేదు. నటుడు శివ రాజ్ కుమార్ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. దాదాపు ఆయన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సౌతిండియా స్టార్లతో కలిసి ఈ వేడుక వైభంగా సాగనుంది.


Click it and Unblock the Notifications











