రజనీకాంత్ హీరోగా మరో భారీ చిత్రం ఖరారు, రంగంలోకి సన్ నెట్వర్క్

By Bojja Kumar

Recommended Video

Rajinikanth's one more High Budget movie

రజనీకాంత్ అంటేనే భారీ సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ 2.0 చిత్రం తెరకెక్కుతోంది. మరో వైపు ఆయన పా రంజిత్ దర్శకత్వంలో చేస్తున్న 'కాలా' చిత్రం కొన్ని రోజుల్లో(ఏప్రిల్ 27) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోపే రజనీకాంత్ నెక్ట్స్ మూవీ ఖరారైంది. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన కూడా రావడం విశేషం.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో

సూపర్ హిట్ ఫిల్మ్ ‘పిజ్జా' చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీకాంత్ తన నెక్ట్స్ మూవీ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని సన్ నెట్వర్క్‌కు చెందిన ‘సన్ పిక్చర్స్' సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతోంది. గతంలో ఈ సంస్థ రజనీతో ‘యంతిరన్'(రోబో) చిత్రం తెరకెక్కించింది.

త్వరలో పూర్తి వివరాలు

ప్రస్తుతం సినిమాను ఫార్మల్‌గా అనౌన్స్ చేశారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఒక వినూత్న కథ చెప్పడంతో రజనీకాంత్ ఫిదా అయ్యారని, వెంటనే అతడితో సినిమా చేయడానికి ఓకే చెప్పారని తమిళ సినీ వర్గాల టాక్.

 సినిమాలు, రాజకీయాలు

సినిమాలు, రాజకీయాలు

రజనీకాంత్ ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. 2.0 మూవీ తర్వాత ఆయన పూర్తిస్థాయి క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంటరవుతారని అంతా భావించారు. అయితే ఆయన అందరి అంచనాలు తారుమారు చేస్తూ మరో సినిమాకు కమిట్ కావడం హాట్ టాపిక్ అయింది.

ఆ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

ఆ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 2.0 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాక పోవడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ఈ చిత్రం 2018 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X