‘సెవంత్ సెన్స్’పై ట్విట్టర్లో రజనీకాంత్
సూర్య కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'సెవెన్త్ సెన్స్" సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తెగ నచ్చేసింది. ఈ సినిమాను ఆయన దీపావళి రోజు చెన్నయ్ లో ఈ సినిమా చూసిన అనంతరం చిత్రం అద్భుతంగా ఉందని రజనీ స్వయంగా ట్విట్టర్‌లో రాశారు. 'ఎక్సలెంట్ మూవీ. సూర్య హార్డ్‌వర్క్ సూపర్భ్" అని రజనీ ట్వీట్ చేశారు. కథానాయకుడు సూర్య, నిర్మాత ఉదయనిధి స్టాలిన్....రజనీని స్వయంగా ఆహ్వానించి దగ్గరుండి మరీ షో చూపించారు. అదేరోజు తను అతిధి పాత్రలో నటించిన 'రా.వన్"ని కూడా రజనీ కుటుంబ సమేతంగా తిలకించారు.
సెవెన్త్ సెన్స్ సినిమాలో సూర్య రెండు పాత్రల్లో కనిపించాడు. 1600 సంవత్సరాల నాటి మహా వ్యక్తిగా, సకల విద్యలు తెలిసిన బోధి ధర్ముడిగా, ప్రస్తుత కాలంలో సర్కస్ కళాకరుడిగా కనిపించాడు. ఈ సినిమాలో సూర్య సరసన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటించారు. హారిస్ జయరాజ్ ఈసినిమాకు సంగీతం అందించారు. తెలుగు నాట ఈ అనువాద సినిమాకు సరైన ఆదరణ లభించడం లేదనే చెప్పాలి. యావరేజ్ టాక్ రావడంతో స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
మన సనాతన సంప్రదాయాలను, పూర్వీకులు నేర్పిన విద్యలను, వారు రాసిన గ్రంథాలకు మనం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.... ఇతర దేశాల వాళ్లు వాటి ద్వారా మనకంటే పైచేయి సాధిస్తున్నారు, ఇప్పటికైనా ఈవిషయాన్ని భారతీయులు గుర్తించాలి అనే సందేశంతో మురగదాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు.


Click it and Unblock the Notifications











