twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ ఛానెల్స్ రజనీకాంత్ ని ఎద్దేవా చేస్తూ...

    By Srikanya
    |

    ఉత్తరాది మీడియాకు మొదటి నుంచి దక్షిణాది నటులు అన్నా,దర్శకులు అన్నా చిన్న చూపు. బాలీవుడ్ లో దక్షిణాది వారి సినిమాలు వర్కవుట్ కాకపోతే వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు వీరు చూపు రజనీకాంత్ పై పడింది. తాజాగా రజనీకాంత్ గెస్ట్ రోల్ గా చేసిన రా వన్ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కానట్లే అని ట్రేడ్ వర్గాలు తేల్చేసాయి. బాలీవుడ్ మీడియా..టీవీ ఛానెల్స్ అయితే రజనీకాంత్ గెస్ట్ గా చేస్తే సినిమా నడుస్తుందా..సినిమాలో విషయముండాలే కానీ ఎద్దేవా చేస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది.వారు రావన్ సినిమా పోయిందనే దానికన్నా రజనీకాంత్ ఛరిష్మా సినిమాని నిలబెట్టలేదని చెప్పటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.ఎందుకంటే సినిమాలో రజనీకాంత్ కనపడేది ఒక్క నిముషం పాటే కదా అని అంటున్నారు.ఇక రజనీ ప్యాన్స్ అయితే రజనీ తన ట్రేడ్ మార్క్ ఒక్కటి కూడా చేయనప్పుడు అస్సలు రజనీనే కనపడ్డారని ఫీల్ ఎలా అవుతామని అన్నారు.కేవలం సౌత్ లో కలెక్షన్స్ రాబట్టుకోవటానకి షారూఖ్ చేసిన చీప్ ట్రిక్ ...రజనీ గెస్ట్ రోల్ అంటున్నారు. ఇక ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం రజనీ మరికొద్ది సేపు ఉంటే గ్యారెంటీగా సినిమా మెరుగైన వసూళ్లను రాబట్టేది సౌత్ ఇండియా అని బల్లగుద్ది చెప్తున్నారు.ఏదైమైనా రావన్ ఓ ప్లాఫ్ షో గా మిగిలిపోయింది. కేవలం చిన్నపిల్లల సినిమా అని ప్రచారం మాత్రం సాగుతోంది.

    English summary
    The cameo of rajinikanth in Ra.One is well received by audience all over the world. When Chitti appeared on screen, there are more whistles from audience than for any other scene of Shah Rukh Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X