రజనీకాంత్ కోసం స్పెషల్ కేక్: విశేషం ఏమంటే?

By Bojja Kumar

హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఇటీవల 'లింగా' షూటింగులో స్పెషల్ కేక్ తెప్పించి ఆయనతో కట్ చేయించారు. సాధారణ బస్ కండక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన రజనీకాంత్ నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగు పెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగారు.

ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న 'లింగా' సినిమా విశేషాల్లోకి వెళితే...కెఎస్ రవికుమార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు.

లింగా

లింగా

ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరిగింది. క్లెమాక్స్‌ సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

క్లైమాక్స్

క్లైమాక్స్

ఈ క్లైమాక్స్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. హై ఓల్టేజ్ క్లైమాక్స్ ఇదని, రజనీ కెరీర్ లో అద్బుతంగా మిగిలేలా చిత్రీకరించాలని దర్శక,నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. క్లైమాక్స్ సీన్లో కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 నయనతార

నయనతార

ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది.

ఇప్పటి నుండే బిజినెస్

ఇప్పటి నుండే బిజినెస్

రీసెంట్ గా రజనీ నటించిన ‘విక్రమ్ సింహా' ప్లాఫ్ అయినా "లింగా" డబ్బింగ్ రైట్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా బిజినెస్ ఎంక్వైరీలు వస్తున్నట్లు సమాచారం. తెలుగులో ఈ చిత్రం రైట్స్ సంపాదించాలని పెద్ద నిర్మాతలు సైతం ట్రేడ్ ఎంక్వైరీలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X