»   » మంచు మనోజ్ పెళ్లి వేడుకలో రజనీకాంత్ డాన్స్

మంచు మనోజ్ పెళ్లి వేడుకలో రజనీకాంత్ డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ వివాహం పణతి రెడ్డితో మే 20న జరుగబోతున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుక వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐదు రోజుల పాటు వివాహ వేడుక జరుగనుంది. ఇందులో భాగంగా నిర్వహించే సంగీత్ వేడుకలో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, కన్నడ నటుడు అంబరీష్ ఇతర నటులు, హీరోయిన్లు పాల్గొనబోతున్నారు. సంగీత్ కార్యక్రమానికి మంచు లక్ష్మి యాంకరింగ్ చేయబోతోంది. ఈ వేడుకలో రజనీకాంత్, అంబరీష్ తదితరులు డాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. శంషాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లో ఈ వేడుక జరుగనుందట.

ఆహ్వానం వచ్చిందన్నారు. మోడీని కలవడం గర్వంగా ఉందని మనోజ్, విష్ణు, మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ఇటీవలే మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగింది. మనోజ్-ప్రణతి వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.

Rajinikanth Dance at Manchu Manoj Sangeet

కాబోయే కోడలి గురించి మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు ''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి ఇద్దరూ క్లాస్ మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికీ పరిచయం ఏర్పడింది. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్ లో సీపీఎ (అమెరికాలో చార్టెడ్ ఎకౌంట్ ని సిపీఎ అంటారు) చేసింది. రెండు రోజుల క్రితం ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలను కలిసి వివాహ విషయం మాట్లాడాం. మీ అందరి ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది'' అని చెప్పారు.

English summary
Manchu Manoj is all set to marry his love interest Pranitha Reddy on May 20 in Hyderabad. Rajinikanth Dance at Manchu Manoj Sangeet.
Please Wait while comments are loading...