తలైవా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కానీ వారం రోజుల పాటు.. డిశ్చార్జ్ అయిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తలైవా ఆరోగ్యం స్థిమితంగా ఉండటంతో ఈ రోజు డిశ్చార్జ్ చేశామని అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ మేరకు వారు రిలీజ్ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. గత రెండు మూడు రోజులు రజనీ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు అందరినీ కలవరపెట్టాయి. అసలే అన్నాత్తె షూటింగ్ బ్రేక పడటం, అందులో యూనిట్ సభ్యులకు బ్రేక్ పడటం వంటివి జరిగాయి.

షూటింగ్‌లో కరోనా..
రజినీకాంత్ ప్రస్తుతం చేస్తోన్న అన్నాత్తె షూటింగ్‌లో కరోనా తాండవం చేసింది. యూనిట్ సభ్యులు కరోనా బారిన పడటంతో రజనీకాంత్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ అందులో నెగెటివ్ అని వచ్చింది. అలా వచ్చిన రెండ్రోజులకే ఇలా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు.

రక్తపోటు సమస్యలు..
రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో వెంటనే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం, రక్తపోటులో హెచ్చుతగ్గులున్నాయి.. అది తప్పా రజనీకాంత్‌కు ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేవని హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనుమతించలేదు..
రజనీకాంత్ ఎవ్వరినీ అనుమతించడం లేదని, హాస్పిటల్‌కు ఎవ్వరూ రావొద్దని, ఆయన వద్ద కూతురు ఐశ్వర్య ఉన్నారని హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించడంతో మరోసారి అందరూ ఆందోళనకు గురయ్యారు. కానీ తాజాగా వచ్చిన ప్రకటనతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు.

డిశ్చార్జ్ చేశాం..
రక్తపోటు సమస్య వల్ల డిసెంబర్ 25న రజనీకాంత్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. రజనీకాంత్‌ని నిరంతరం పర్యవేక్షించాం.. ఇప్పుడు అతని బీపీ కంట్రోల్‌లోకి వచ్చింది.. మునుపటి కంటే ఆరోగ్యంగా ఉన్నారు.. అతని ఆరోగ్యంలో వచ్చిన మార్పుకారణంగా ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నామని ప్రకటించారు.

వారం రోజుల పాటు విశ్రాంతి..
ఆయన వయసురీత్యా కొన్ని పాటించాలని చెప్పాం.. వారం రోజుల పాటు పూర్తిగా విరామం తీసుకోవాలని, రెగ్యులర్‌గా బీపీ చెక్ చేయించుకోవాలి. ఒత్తిడిని లోను కాకుండా చూసుకోవాలి.. కొంత వ్యాయామం వంటివి చేయాలని అపోలో హాస్పిటల్స్ ఓ ప్రకటనను జారీ చేసింది.


Click it and Unblock the Notifications