ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వైరల్ ఫీవర్, బ్రాంకైటిస్ సమస్యతో ఆయన వారం రోజుల క్రితం చెన్నైలోని ఇస్బెల్లా ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం కుదుట పడడంతో రజనీకాంత్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.
అరవై ఏళ్ల రజనీకాంత్ నటించిన రోబో చిత్రం ఇటీవల సూపర్ హిట్టయ్యింది. ఆయన ప్రస్తుతం రాణా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొనే రజనీకాంత్ పోషిస్తున్న యువకుడి పాత్ర సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications











