For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెన్నై వరదలు: ఈసారి 10 కోట్ల విరాళ ప్రకటించిన రజనీకాంత్

  By Bojja Kumar
  |

  చెన్నై: చెన్నై వరద బాధితుల సహాయం కోసం సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ రూ. 10 కోట్ల విరాళం అందించి టాప్ పొజిషన్‌కు వెళ్లారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి స్వయంగా తన విరాళం అందించారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

  ఇంతకు ముందు రజనీకాంత్ తన నిర్వహిస్తున్న ‘శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా రూ. 10 లక్షల విరాళం ఇచ్చారు. తాగా రూ. 10 కోట్లు ఇవ్వడంతో ఆయన ఇచ్చిన విరాళం పది కోట్ల పది లక్షల రూపాలయలకు చేరింది. ఇంతకు ముందు రజనీకాంత్ కేవలం 10 లక్షలు మాత్రమే విరాళం ఇచ్చారంటూ కొందరు విమర్శించిన నేపథ్యంలో... ఆయన ఇపుడు 10 కోట్లు విరాళం ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

  భారీ వదలతో ఆపదలో చిక్కుకున్న చెన్న వాసులకు సహాయం చేసేందుకు పలువురు సినీ స్టార్లు ముందుకు వస్తూనే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ ఫేరుతో సినిమా తీసిన షారుక్ ఆ సినిమా ద్వారా భారీ లాభాలు పొందిరు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న చెన్నై నగరానికి తనవంతుగా రూ. కోటి విరాళం ప్రకటించారు.

  మరో వైపు ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ చెన్నై వరద బాధితుల సహాయార్థం రూ. 5 కోట్లు విరాళం ప్రకటించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ మరికొందరు స్టార్లు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ బాధితులకు ఆహారం, మంచి నీరు పంపిణీ చేస్తున్నారు.

  మరో తమిళ స్టార్ అజిత్...చెన్నై బాధితులను ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా వారి తక్షణ అవసరాలు తీరుస్తున్నారు. దాదాపు 180 మందికి తన ఇంట్లో షెల్టర్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఆహారం తయారు చేయించి వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి పంచుతున్నారు. దీంతో పాటు ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించారు.

  Rajinikanth donates 10 crores for Chennai flood relief

  రాఘవ లారెన్స్..
  నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రూ. 1 కోటి విరాళం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

  అల్లు అర్జున్
  ‘చెన్నై వరద బాధితులకు రూ. 25 లక్షల విరాళం అందించాలని నిర్ణయించుకున్నాను. నేను నా తొలి 18 ఏళ్ల జీవితం అక్కడే గడిపాను. నన్ను ఇపుడు మీ ముందు హీరోగా నిలబెట్టిన నగరం. ఐలవ్ యూ చెన్నై అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

  మహేష్ బాబు మాట్లాడుతూ...
  భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్తితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయంగా రూ. 10 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాను అన్నారు.

  ఎన్టీఆర్ 10 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు
  "చెన్నైతో మాకు ఉన్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం నుండి నేడు వస్తోన్న చిత్రాలను చూస్తోంటే చాలా బాధ గా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది. సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం ఇది. మా తరపున ఆర్ధిక సహాయాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాం. చెన్నై త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం", అని ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తెలిపారు.

  సూర్య, కార్తి
  తమిళ స్టార్ సోదరులు సూర్య, కార్తి కలిపి చెన్నై వదర బాధితుల కోసం రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.

  ప్రభాస్, కృష్ణం రాజు కలిపి 15 లక్షలు
  బాహుబలి స్టార్ ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణం రాజు కలిసి రూ. 15 లక్షల విరాళం ప్రకటించారు.

  రవితేజ 5 లక్షలు
  మాస్ మహరాజ్ రవితేజ చెన్నై వరద బాధితులకు రూ. 5 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

  ధనుష్..
  తమిళ నటుడు ధనుష్ చెన్నై వరద బాధితుల కోసం రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు.

  వరుణ్ తేజ్
  యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.

  సాయి ధరమ్ తేజ్
  మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ రూ. 3 లక్షల విరాళం ప్రకటించారు.

  సంపూర్ణేష్
  టాలీవుడ్ కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబు తన వంతుగా రూ. 50 వేలు విరాళం ప్రకటించారు.

  English summary
  As per latest reports, yesterdayRajinikanth met Chief Minister Jayalalitha and offered Rs. 10 Crore check to CM Relief fund to help people who severely affected by Chennai floods.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X