twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఫ్రెండ్, బస్ డ్రైవర్.. ఈ అవార్డు వారికే అంకితం.. రజినీ ఎమోషనల్

    |

    ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే రజినీకాంత్‌కు ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వీస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు రజినీకి విషెస్ చెబుతున్నారు. తన మీద కురిపిస్తున్న ఈ ప్రేమకు రజినికాంత్ ముగ్దుడయ్యాడు. ఈమేరకు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

    అందరినీ గుర్తుపెట్టుకుని..

    అందరినీ గుర్తుపెట్టుకుని..

    తాను ఈ స్థాయికి ఎదగడంలో తోడ్పడిన ప్రతీ ఒక్కరినీ రజినీ గుర్తుకు చేసుకున్నాడు. తాను కండక్టర్‌గా ఉన్న సమయంలో తన ఫ్రెండ్ అయిన బస్ డ్రైవర్ నుంచి ప్రతీ ఒక్కరినీ తలుచుకున్నాడు. వారందరినీ గుర్తు చేసుకుని అవార్డును వారికి అంకితం చేశాడు రజినీకాంత్.

    అందరికీ థ్యాంక్స్

    అందరికీ థ్యాంక్స్

    దేశంలో సినీ రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును నాకు ఇస్తున్నట్టుగా ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధానీ మోదీ, జ్యూరీ మెంబర్స్‌కి అందరికీ థ్యాంక్స్ అంటూ రజినీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు.

    అంకితం చేస్తున్నా

    అంకితం చేస్తున్నా

    నాలో నటుడు ఉన్నాడని గుర్తించి, ప్రోత్సహించిన నా ఫ్రెండ్, బస్ డ్రైవర్ రాజ్ బహదూర్, కడు బీదరికంలో ఉన్నప్పుడు నన్ను నటుడిగా చేసేందుకు ఎన్నో త్యాగాలు చేసిన నా అన్న సత్య నారాయణ గైక్వాడ్, తెర మీదకు రజినీకాంత్‌లా నన్ను పరిచయం చేసిన నా గురువు కే బాలచందర్, నా దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్, మీడియా.. నాప్రాణం సమానులైన నా తమిళ ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అని రజినీ పేర్కొన్నాడు.

    జై హింద్ అంటూ

    జై హింద్ అంటూ

    తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రతిపక్ష నేత స్టాలిన్, నా సోదరుడు కమల్ హాసన్.. కేంద్ర మంత్రులు ఇతర రాజకీయ ప్రముఖులు, సినీ మిత్రులందరూ కూడా ప్రేమను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్. తమళ ప్రజలు ఎప్పుడూ ఇలానే ఎదుగుతూ ఉండాలి.. తమిళ నాడు ప్రకాశిస్తుండాలి.. జై హింద్ అంటూ రజినీ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Rajinikanth Emotional On Receiving Dadasaheb phalke
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X