twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ పాపులర్ డైలాగ్ కాపీకొట్టిందే...ఇదిగో సాక్ష్యం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : 'బాషా ఒక్కసారి చెబితె...వంద సార్లు చెప్పినట్లే' అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ 'బాషా' చిత్రంలో చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకు ముందు కేవలం తమిళనాడుకే పరిమితమైన రజనీ పాపులారిటీ 'బాషా' చిత్రం తర్వాత దేశం మొత్తం పాకింది. ఆ తర్వాత నుంచి ఆయన జాతీయ స్థాయి హీరోగా ఎదిగారు.

    18 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా గురించి, ఆ డైలాగ్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాం అంటే....తాజాగా ఈ సంచలన డైలాగ్ గురించి ఓ వాస్తవం వెలుగులోకి వచ్చింది. రజనీ నోట వచ్చిన ఆ పాపులర్ డైలాగ్ ఆ చిత్ర దర్శకుడో, మాటల రచయితో సొంత తెలివి తేటలతో వచ్చింది కాదని, ప్రముఖ నావలిస్ట్ జాన్ ఆస్టిన్ నవల నుంచి కాపీ కొట్టిందని స్పష్టమవుతోంది.

    జాన్ ఆస్టిన్ రచించిన 'Emma' నవలలో 'If I've told you once, I've told you a 100 times' అనే వ్యాఖ్యాన్ని రజనీకి అనుకూలంగా డైలాగ్ రూపంలో మార్చారు. ఈ నవల 1815లో పబ్లిష్ అయింది. మరి ఇది దర్శకుడు సురేష్ కృష్ణన్ ఆ నవల నుంచి ఇన్ స్పైర్ అయి ఆ డైలాగ్ రాసారా? లేక ఇదో కో ఇన్సిడెంటా? అనే చర్చ సాగుతోంది.

    రజనీకాంత్‌కి 'బాషా' సినిమా ద్వారానే మాస్ ఇమేజ్ వచ్చిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా సినిమాలోని ఈ డైలాగ్ అప్పట్లో సెన్సేషన్ అయింది. మరి ఆ డైలాగ్ ఆ నవల నుంచి కాపీ కొట్టిందా? లేక అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగిందా? అనే ప్రశ్నకు దర్శకుడు సురేష్ కృష్ణన్ మాత్రమే సమాధానం చెప్పగలరు. క్రింది ఇమేజ్ లో...జాన్ ఆస్టిన్ నవలలోని పదాలను గమనించవచ్చు.

    English summary
    "Baasha okkasari chebite 100 sarlu cheppinatle... (If I say it once, it's equivalent to having said it a 100 times)" - It is probably the one dialogue from blockbuster Baasha that crossed the borders and reached the non-Tamilain communities all across India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X