ఎక్కడ చూసినా రజనీ ఫీవర్: 2.0 థియేటర్ల వద్ద పండగ వాతావరణం!
Recommended Video

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్న ఆయన సినిమా వస్తుందంటే... అందులోనూ అది ఇండియాలోనే అతిపెద్ద మూవీ అంటే హంగామా ఓ రేంజిలో ఉంటుంది.
తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో 2.0 చిత్రం భారీ ఎత్తున రిలీజైంది. తమిళనాడులో అయితే నిన్నటి నుంచే రజనీ ఫీవర్ మొదైలైంది. థియేటర్ల వద్ద పండగ వాతావరణ నెలకొంది. ఫ్యాన్స్ భారీ కటౌట్లతో తమ అభిమానం చాటుకున్నారు.
రసూల్ పూకుట్టి ట్వీట్
తమిళనాడులో 2.0 మూవీ ఫీవర్ ఎలా ఉందో తెలియజేస్తూ ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ట్వీట్ చేశారు.

థియేటర్ల వద్ద భారీ కటౌట్లు
తమిళనాడుతో పాటు సౌత్‌లోని పలు ప్రాంతాల్లో 2.0 సినిమా విడుదలవుతున్న థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

వెల్లువెత్తిన అభిమానం
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులందరూ తమ గుర్తింపును చాటుకుంటూ థియేటర్ల వద్ద భారీగా హోర్డింగులు ఏర్పాటు చేశారు.

గర్వంగా చెప్పుకుంటున్న ఫ్యాన్స్
ఇండియాలో అతిపెద్ద మూవీ, అత్యంత హైబడ్జెట్ సినిమాలు రజనీకాంత్‌తో మాత్రమే సాధ్యమని., 2.0 చిత్రం ఇప్పటి వరకు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉనప్న రికార్డులన్నీ బద్దలు కొడుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











