twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కాలా’ ఫీవర్: రజనీ ఫ్యాన్స్ విన్యాసాలు చూసి నివ్వెరపోయిన ఇండియా!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ‘కాలా’ ఫీవర్: రజనీ ఫ్యాన్స్ విన్యాసాలు చూసి నివ్వెరపోయిన ఇండియా!

    రజనీకాంత్.... ఈ పేరుకు ఉన్నంత క్రేజ్ దేశంలో బహుషా మరే స్టార్ హీరోకు ఉండదేమో? భారత్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఆయా ప్రాంతీయ భాషలకు సంబంధించిన సినీ పరిశ్రమలు వేర్వేరుగా ఉన్నాయి. సినిమా మార్కెట్లో అక్కడి లోకల్ స్టార్లే కింగ్స్. అయితే ఇందుకు భిన్నంగా అన్ని చోట్లా తన సినిమాలంటే పడిచచ్చేలా క్రేజ్ సంపాదించుకుంది మాత్రం ఒకే ఒక్క స్టార్.... సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకి ఇంత ఇంత ఆదరణ లభించడానికి కారణం ఆయన యూనిక్ స్టైల్, మాస్ అప్పియరెన్స్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా విడుదలైన రజనీ తాజా మూవీ 'కాలా'తో ఇండియా వ్యాప్తంగా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

    రజనీకాంత్ ఫ్యాన్స్ విన్యాసాలు

    చెన్నై, ముంబై, హైదరాబాద్ ఇలా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు అనేక చోట్ల తెల్లవారు ఝాము నుండే సందడి మొదలైంది. రజనీకాంత్ అభిమానులు తమ అభిమాన హీరోపై అభిమానాన్ని ప్రదర్శిస్తూ చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముంబైలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు థియేటర్లకు పోటెత్తారు.

    చెన్నైలో పండగ వాతావరణం

    బయట రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.... రజనీకాంత్‌ను ఆల్మోస్ట్ గాడ్‌గా ఆరాధించే తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు వ్యాప్తంగా ‘కాలా' విడుదల సందర్భంగా పండగ వాతావరణం నెలకొని ఉంది.

    ముంబైలో పోటెత్తిన అభిమానం

    ‘కాలా' చిత్రం ముంబైలోని ధారావి అనే స్లమ్ ఏరియా నేపథ్యంలో చిత్రీకరించారు. హిందీలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేశారు. తమిళనాడుకు ఏ మాత్రం తీసిపోకుండా ముంబైలో కూడా ‘కాలా' ఫీవర్ కనిపించడం గమనార్హం.

    హైదరాబాద్‌లో సందడే సందడి

    రజనీకాంత్ సినిమాలు తమిళనాడు తర్వాత ఎక్కువ ఆదరణ పొందేది తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక హైదరాబాద్‌లో ‘కాలా' సందడి ఊహించిన దానికంటే ఎక్కువగానే కనిపించింది. తెలుగు వారితో పాటు ఇక్కడ సెటిలైన తమిళులు తెల్లవారుఝాము నుండే థియేటర్ల వద్ద క్యూకట్టారు.

    కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులు

    కావేరీ జల వివాదం కారణంగా ‘కాలా' సినిమాపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. అత్త మీద కోపం దుత్తమీద అన్నచందంగా.... కావేరీ వివాదంలో రజనీకాంత్ తమిళులకు అనుకూలంగా మాట్లాడారు అనే కోపంతో ఆయన సినిమాను కర్నాటకలో అడ్డుకుంటున్నారు. పోలీసు భద్రత మధ్య కాలా అక్కడ విడుదలైనా.... పరస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సినిమా చూడాలనే కోరిక ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులు థియేటర్ల వైపు వెళ్లడానికి భయపడుతున్నారు.

    English summary
    Rajinikanth’s Kaala hit theatres worldwide on 7 June, as scheduled, after the Supreme Court, on 6 June, refused to stay its release. In Kaala, Rajnikanth has never looked so good on screen with his stylised look and presentation, Patori body language, and dialogue delivery. Pa. Ranjith has been able to get the right balance in a tightrope walk between Rajni’s larger-than-life image and the changing taste of today’s mass multiplex audience without losing his famous touch. In short, Pa. Ranjith has given us a more peppy and upmarket Rajni that is sure to work with today’s youth audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X