ఛీ..ఛీ! మరీ ఇంత చెత్తగానా?... రోబో 2.0 పోస్టర్ మీద విమర్శలు!
2.0 సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. అయితే ఈ పోస్టర్ బాగోలేదంటూ రజనీ అభిమానులు విమర్శిస్తున్నారు.
Recommended Video

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.0 మూవీ ఆడియో వేడుక ఇటీవల దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది రజనీకాంత్ అభిమానులు తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు.
ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు ఇతర ఎంటర్టెన్మెంట్ కార్యక్రమాలతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ వేడుక జరిగింది. ఈ చిత్రానికి రెహమాన్ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటూ తాజాగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ మీద చాలా దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి.
కోట్లు ఖర్చు పెట్టి మరీ ఇంత చెత్తగానా?
2.0 సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన పోస్టర్ మీద దారుణమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా కోసం దాదాపు రూ. 500 కోట్లు వరకు ఖర్చు పెట్టారు. పోస్టర్ డిజైన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చెత్త పోస్టర్ల వల్ల సినిమాపై ఇంప్రెషన్ పోతుంది అంటూ... అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మెర్సల్, తేరీ, వివేగం పోస్టర్లు చాలా బెటర్
ఇపుడు విడుదలైన 2.0 పోస్టర్ కంటే మెర్సల్, తేరి, వివేగం లాంటి సినిమా పోస్టర్లు చాలా బెటర్ గా ఉన్నాయని, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇకపై అయినా మంచి పోస్టర్లు రిలీజ్ చేయండి అంటూ అభిమానులు కోరుతున్నారు.

పోస్టర్ చూసి జడ్జ్ చేయొద్దు
కేవలం పోస్టర్ చూసి సినిమాను జడ్జి చేయవద్దు. 3డిలో ఈ లుక్ బావుంటుందని భావిస్తున్నాను. 3డిలో బాగా కనిపించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఎంచుకుని ఉంటారని మరికొందరు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

అభిమానులకు నచ్చడం లేదు
ఈ పోస్టర్ డిజైన్స్ రజనీకాంత్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. మంచి గ్రాఫిక్ డిజైనర్స్‌ను హైర్ చేసుకోండి ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

భోజ్‌పురి సినిమా పోస్టర్‌లా ఉంది
ఈ సినిమా పోస్టర్ మన స్థాయికి తగిన విధంగా లేదని, ‘భోజ్‌పురి' మూవీ పోస్టర్ మాదిరిగా ఉందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా రిలీజ్ వాయిదా?
కాగా.... రోబో సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని తొలుత జనవరి 25న విడుదల చేద్దామనుకున్నారు. అయితే సినిమాను ఏప్రిల్ 13కు వాదాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రోబో టీం నుండి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











