రజనీకాంత్‌ను విమర్శించే స్థాయి నీకుందా? పచ్చి అవకాశవాదివి. రోజాపై తలైవా ఫ్యాన్స్ ఫైర్

స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్సాహవంతమైన ప్రసంగాన్ని చేశారు. తన ప్రసంగంలో భాగంగా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. ఆయన వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్ లాగా చేశారు. చంద్రబాబు విజన్ గొప్పది. ప్రస్తుతం ఆయన రూపొందించిన 2047 విజన్ అమలైతే..ఏపీ ఇండియాలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని కామెంట్ చేశారు. అయితే వైసీపీ మంత్రి రోజా ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ...

ఏపీ పాలిటిక్స్ రజనీకి తెలియవు:ఏపీ మంత్రి రోజా పాండిచ్చేరిలో ఓ కార్యక్రమానికి హాజరై మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఆయన రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఎన్టీఆర్‌ను చంపేసి పార్టీని ఎలా లాగేసుకొన్నారో ఆయనకు తెలుసు. ఆంధ్రా రాజకీయాల గురించి రజనీకాంత్‌కు ఏమీ తెలియదు. రాజకీయ అనుభవం లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు అని రోజా అన్నారు.

Rajinikanth fans trolled Rojas comments of Super Star is Zero in #YSRCPApologizeRAJINI trends

రజనీకాంత్ జీరో అంటూ కామెంట్:తెలుగు ప్రజలు రజనీకాంత్ సూపర్ స్టార్‌గా చూస్తారు. కానీ ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల్లో ఆయన చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించిన తర్వాత ఆయన జీరో అయ్యారు. పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆయన ఆ రాష్ట్రా పాలిటిక్స్ గురించి తెలుసుకోవాలి. ఏదైనా మాట్లాడే ముందు ఆయన అన్ని చూసుకొని మాట్లాడాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరను అని రోజా అన్నారు.

Rajinikanth fans trolled Rojas comments of Super Star is Zero in #YSRCPApologizeRAJINI trends

రోజా పార్టీలు మారే నీకు ..:రజనీకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై ఆయన అభిమానులు భగ్గుమన్నారు. అవును నీకు తెలిసిన డర్టీ పాలిటిక్స్ రజనీకాంత్‌కు తెలియవు. డబ్బు, హోదా కోసం పార్టీలు మారే నీకు.. ఆయనను విమర్శించే హక్కు ఉందా? నీకు రజనీకాంత్‌ను విమర్శించే స్థాయి నీకు లేదు అంటూ రోజాపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారంటూ :వైసీపీ పార్టీని, జగన్‌ను ఏమీ అనలేదు. కానీ రజనీకాంత్‌కు వ్యతిరేకంగా రోజా, కొడాలి నాని కుక్కల్లా మొరుగుతున్నారు. వారికి వచ్చి సమస్య ఏమిటి? వారికి ఏమైనా బిస్కట్స్ కావాలంటే ఇస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. బిస్కట్లు తిని మూసుకోండి అంటూ రజనీకాంత్ ఘాటుగా స్పందించారు. రజనీకాంత్ జీరో అంటూ రోజా చేసిన కామెంట్లపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రోజా ఎంతకు దిగజారిందో అంటూ :ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు దేశం పార్టీలో పనిచేసిన రోజా ప్రస్తుతం రజనీకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలతో మొరుగుతున్నది. రాజకీయాల్లో తమ అస్థిత్వానికి ఎంత వరకు దిగజారుతారో అనే విషయం రోజాను చూస్తే అర్ధం అయింది. కొద్ది సంవత్సరాలుగా ఏపీ రాజకీయాలకు రోజా, కొడాలి నాని అగౌరవం తెచ్చిపెడుతున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

రాజకీయాల్లో రోజా ఓ ఫూల్:రజనీకాంత్‌పై రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ప్రస్తుత రాజకీయాల్లో రోజా ఓ ఫూల్. ఆమె పక్కా అవకాశవాది. ప్రజా సేవకురాలిగా, రాజకీయ నేతగా రోజా పనికిరాదు. ఏమాత్రం టాలెంట్ లేని వ్యక్తి. కనీసం కామన్ సెన్స్ కూడా లేదు. రోజా = కూజా అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు.

మీనా 40 ఏళ్ల వేడుకలో రోజా అలా:చెన్నైలో ఇటీవల జరిగిన మీనా 40 సినీ కెరీర్ వేడుకలో రోజా పాల్గొన్నారు. ఆ సభలో రజనీకాంత్ దృష్టిలో పడటానికి తంటాలు పడ్డారు. రజనీకాంత్ ఒక్కసారి హాయి చెబితే జన్మ ధన్యమైందని భావించే విధంగా ఫోజు కొట్టింది. రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆయనను జీరో అంటున్నది అని ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు.

రేట్లు పెరుగుతుంటే పట్టించుకొని ప్రభుత్వం :ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.వాటిని మంత్రులు పట్టించుకోకుండా రజనీకాంత్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. రజనీకాంత్ మాటలతో వారు అభద్రతాభావానికి గురయ్యారు. వారంతా చాలా చీప్‌గా బిహేవ్ చేస్తున్నారు అని కామెంట్ చేశాడు. రజనీకాంత్ జైలర్ పోస్టర్ పెట్టి చేసిన ట్వీట్ వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X