రజనీకాంత్ సినిమాపై అవి రూమర్స్..తేల్చేసిన దర్శకుడు
ఇక వెబ్ మీడియాలో వచ్చిన న్యూస్ ఏమిటంటే... వీరిద్దరి కాంబినేషన్ రీసెంట్ గా అఫీషియల్ గా ఖరారైందని, ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని వెల్లడించిందని తెలియచేసారు. అంతేగాక.. ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియాకు చెందిన ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ జైన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.....'కొచ్చాడయాన్, రాణా(పెండింగ్ ప్రాజెక్ట్) తర్వాత రజనీకాంత్‌తో మరో సినిమా చేయడానికి డీల్ కుదుర్చుకున్నాం. ఈ చిత్రానికి కె.వి.ఆనందర్ దర్శకత్వం వహిస్తారు. ఇతర వివరాలు ఫైనలైజ్ అయిన తర్వాత ప్రకటిస్తాం' అని చెప్పినట్లు రాసుకొచ్చాయి.
గతంలో కె.వి.ఆనంద్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసారు. తాజాగా రజనీకాంత్ చిత్రానికే దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో కెవి ఆనంద్ రంగం అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సూర్యతో బ్రదర్స్ చిత్రం తీసినా అది పెద్దగా విజయం సాధించలేదు.


Click it and Unblock the Notifications












