twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రజినీకాంత్ !

    |

    పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం జూన్ 7వ తేదిన విడుద‌ల కానుంది. కాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 29న హైదరాబాద్ లో గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధ‌నుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నారు.

    సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తమిళ మూవీ కాలా. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్ నటిస్తోంది. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

     rajinikanth going to give surprize to fans

    బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న కాలా సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈరోజు (సోమవారం) సాయంత్రం 7 గంటలకు కొత్త ట్రైలర్ విడుదల చెయ్యబోతున్నారు. అభిమానులకు ఇది సడన్ సర్ప్రైజ్ అనొచ్చు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.

    English summary
    Kaala stars Rajinikanth in the lead role. The film is produced by Dhanush and is all set to hit the screens on June 7. With just days to go for the release of Rajinikanth's Kaala. the movie has directed by Pa Ranjith, has been in the news for the past few months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X