రా.వన్ లో రజనీకాంత్ అతిథిపాత్ర
బాలీవుడ్ స్టార్ షారుఖ్ హీరోగా రూపొందుతున్న రా.వన్ సినిమాలో...సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. రజనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఈ సినిమాలో రజనీ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తూంది. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రా.వన్ సినిమా యూనిట్ సభ్యులు సమాచారం.
రోబో సినిమా తర్వాత రజనీ వెండి తెరపై కనిపించ లేదు. రాణా సినిమా షూటింగ్ మొదలైన రోజే ఆయన అనారోగ్యానికి గురయి చాలా రోజులు ఆసుపత్రికే పరిమితం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాణా షూటింగ్ అటకెక్కింది. ఈ తరుణంలో రాణా సినిమా కంటే ముందే తమ అభిమాన నటుడు రజనీ వెండి తెరపై తళుక్కుమనే అవకాశం రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.


Click it and Unblock the Notifications











