రజనీకాంత్‌ను అమెరికన్ స్పెషలిస్టులకు సజెస్ట్ చేసిన వైద్యులు

సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యం కారణంగా.. త్వరలో విడుదల కానున్న రాణా చిత్రం చిక్కుల్లో పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. రజనీ అనారోగ్యం కారణంగా రాణా ఫిల్మ్ షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఓ వైపు అనారోగ్యం నుంచి రజనీకాంత్ కోలుకుంటున్నప్పటికీ, వైద్యులు అతడిని అమెరికాలోని స్పెషలిస్ట్‌లకు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు వైద్యులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం రజనీకాంత్ త్వరలోనే అమెరికాకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా రాణా షెడ్యూల్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంపై ఫిలిం మేకర్లు 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లు సమాచారం, ఇప్పుడు వారు రజనీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. సినిమా షూటింగ్ మధ్యలో మరోసారి అతనికి అనారోగ్యం వస్తే పరిస్థితి ఏంటనేది వారి వెంటాడుతున్న ప్రశ్న. తన ఆరోగ్య పరిస్థితిని గమనించిన రజనీకాంత్ కూడా ఈ సినిమా గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాణా చిత్రంలో రజనీకాంత్ పాత్ర చాలా శక్తివంతమైనది, ఈ రోల్ చేయాలంటే ఎంతో ఫిజికల్ ఎనర్జీ కావాలి. మరి ఈ పరిణామాల నేపథ్యంలో రాణా చిత్రం తెరకెక్కుతుందో లేదా కాలమే నిర్ణయించాలి. మనం మాత్రం మన సూపర్‌స్టార్ త్వరగా కోలుకోని, అశేష ప్రేక్షక జనాన్ని అలరించాలని ఆ భగవంతుడిని కోరుకుందాం. గెట్ వెల్ సూన్ రజనీకాంత్..!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X