»   » సూపర్ స్టార్ మొదలెట్టిన చెడ్డ సంస్కృతి.... మహేష్, పవన్ కూడా!

సూపర్ స్టార్ మొదలెట్టిన చెడ్డ సంస్కృతి.... మహేష్, పవన్ కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లోఫర్' సినిమా విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ మీద డిస్ట్రిబ్యూటర్ల దాడి జరిగిన కేసు ఇపుడు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. ఈ దాడి ఘటనను, ఇందుకు దారి తీసిన పరిణామాలపై పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'లోఫర్' సినిమా విషయంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తమను ఆదుకోవాలంటూ దర్శకుడి మీద పడటం ఏమిటని విస్తు పోతున్నారు.

సినిమా అనేది వ్యాపారం.... వ్యాపారంలో లాభ, నష్టాలు సహజం. లాభ నష్టాలకు సిద్దపడే వ్యాపారం అనేది జరుగుతుంది. అయితే నష్టపోయినపుడు తమకు పరిహారం చెల్లించాలంటూ వేధించడం తగదనేది పలువురి వాదన. నష్టం భయం ఉన్నపుడు సినిమాను కొనుగోలు చేసుకునే సమయంలోనే లాభ నష్టాల విషయంలో నిర్మాతతో స్పష్టమైన ఒప్పందం చేసుకోవాలే తప్ప ఇలా.... అసంబద్ధంగా పరిహారం డిమాండ్ చేయడం ఎంత వరకు సబబు అనే వాదన వినిపిస్తోంది.

అసలు ఇలాంటి చెడ్డ సంస్కృతిని మొదలు పెట్టింది సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అని అంటూ కొందరు విమర్శిస్తున్నారు. 2002లో రజనీకాంత్ నటించిన 'బాబా' చిత్రం అట్టర్ ప్లాప్ అయింది. ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. అపుడు రజనీకాంత్ మంచి మనసుతో వారిని తన జేబులో నుండి డబ్బులు తిరిగి ఇచ్చి ఆదుకున్నారు. పాపం అప్పుడు ఆయనక తెలియదు...ఈ మంచి తనం భవిష్యత్తులో తన కొంప ముంచుతుందని. రజనీకాంత్ చేసిన ఈ అలవాటు తర్వాత ఆందోళనలు చేసిన మరీ డబ్బులు రాబట్టుకునే వరకు దారి తీసింది. తర్వాత 'లింగా' విషయంలో రజనీకాంత్ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే.

టాలీవుడ్లో...

టాలీవుడ్లో...


ఈ సంస్కృతి క్రమక్రమంగా దక్షిణాదిన ఇతర సినీ పరిశ్రమలకు పాకింది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా కొంతమంది బడా హీరోలు తమ సినిమా ఫ్లాప్ అయితే.. నష్టాలను తిరిగి చెల్లించడమో లేక తరువాతి చిత్రాలను తక్కువ రేట్లకే ఇచ్చేయడమో చేస్తున్నారు.

పవన్, మహేష్ లాంటి హీరోలు

పవన్, మహేష్ లాంటి హీరోలు


తెలుగులో కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారు దీన్ని కొనసాగిస్తున్నారనే వాదన ఉంది.

ఆస్తులు అమ్ముకున్న వినాయక్

ఆస్తులు అమ్ముకున్న వినాయక్


అఖిల్ సినిమా విషయంలో వివి వినాయక్ కూడా ఇదే దారి పట్టారని, ఆస్తులు అమ్ముకున్నారని టాక్.

లోఫర్

లోఫర్


దీంతో లోఫర్ సినిమా విషయం వచ్చే సరికి డిస్ట్రిబ్యూటర్లు పూరి మీద పడ్డారు. ఎందుకంటే ఈ సినిమాకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది ఆయనే.

ఆరోగ్యకరమైన పరిమాలు కాదు

ఆరోగ్యకరమైన పరిమాలు కాదు


అయితే ఇలాంటి పరిణామాలు ఇండస్ట్రీకి మంచిది కాదనేది పలువురి వాదన. సినిమా కొనుగోలు చేసే సమయంలోనే డిస్ట్రిబ్యూటర్లు లాభ, నష్టాల విషయంలో స్పష్టమైన ఒప్పందం చేసుకోవాలని, అలాంటిదేమీ లేకుండా ఇలా గొడవలు చేయడం మరి పరిణామాలు కాదని అంటున్నారు.

English summary
The alleged attempt by distributors’ to extract money from Puri Jagannadh for losses incurred over the film Loafer has a direct bearing on Rajinikanth. In 2002, when Baba flopped, Rajinikanth was approached by distributors to compensate them. The superstar, ever the kind-hearted do-gooder, reimbursed the distributors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu