రజనీ ఆరోగ్యం గురించి చిరంజీవి ఆరా.. ఐశ్వర్యకు ఫోన్‌లో ధైర్యం.. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వ్యక్తిగత వైద్యుడు
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. రజనీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిరంతరం పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రజనీ ఆరోగ్యం గురించి వైద్యులు వెల్లడించిన మరిన్ని విషయాలు..
Recommended Video

హైదరాబాద్‌కు కుటుంబ సభ్యులు
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌కు బయలు దేరారు. ఇప్పటికే తండ్రికి తోడుగా ఐశ్వర్య రజనీకాంత్ ఉండి వైద్యులు, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రజనీకాంత్ ఉన్న గదిలోకి విజిటర్స్‌ను అనుమతించడం లేదని తెలిసింది.

అపోలో హాస్పిటల్ బులెటిన్
తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో బీపీని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. శుక్రవారం రాత్రి రజనీకాంత్ హాస్పిటల్‌లోనే ఉంటారు. అభిమానులు ఎవరూ కూడా హాస్పిటల్‌కు రావొద్దు అని రజనీ, ఆయన కుటుంబ సభ్యులు కోరారు.

చెన్నై నుంచి వ్యక్తిగత వైద్యుడు
అయితే రజనీకాంత్ బీపీ నియంత్రణలోకి రాకపోవడంతో వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు. శనివారం కూడా మరిన్ని పరీక్షలు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ వ్యక్తిగత వైద్యుడు చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు.

కరోనా పాజిటివ్ లక్షణాలు లేవని
ఇక రజనీకాంత్‌కు కరోనావైరస్ పాజిటివ్ లక్షణాలు లేవని తెలుస్తున్నది. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో నెగిటివ్ అని తేలింది. కొద్ది రోజులుగా రజనీకాంత్ అన్నాతే సినిమా షూటింగు కోసం హైదరాబాద్‌లో ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఫోన్
రజనీకాంత్ ఆరోగ్యంపై అనేక ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో ఐశ్వర్య రజనీకాంత్‌తో మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు, ఐశ్వర్యకు ధైర్యం చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి అవసరమైనా తనకు ఫోన్ ద్వారా సంపద్రించాలని సూచించినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications