రజనీ చంద్రముఖి కాంబినేషన్‌పై ఖండన
చంద్రముఖి సినిమా కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోందని, పి. వాసు దర్శకత్వంలో రజనీకాంత్ మరో సినిమా చేయబోతున్నారని వస్తున్న వార్తలు వట్టి రూమరే అని తాజాగా తేలిన నిజం. ఈ విషయమై దర్శకుడు పి. వాసు మాట్లాడుతూ తాను రజనీతో మరో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని, నేను ఆయన్ను కలిసి కథ వివరించానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.
తమ ప్రమేయం లేకుండా ఇలాంటి వార్తలు ఎలా వెలువడుతున్నాయో అర్థం కావడం లేదని పి. వాసు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రజనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో వారిని అయోమయ పరచడానికే ఇలాంటి రూమర్లు పుట్టిస్తున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాదయన్' చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. పి. వాసు కన్నడ సినిమా 'ఆ రక్షకా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











