Nagarjuna: రజనీకాంత్ కోడలు నాగార్జునను అంత మాట అనేసింది ఏంటి?

టాలీవుడ్ కింగ్ నాగార్జున మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరని చెప్పవచ్చు. వయసు 60దాటినా కూడా ఆయన పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. మరి అలాంటి వ్యక్తిని ఏ అమ్మాయి అయినా అన్నయ్య అని పిలుస్తుందా.. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ నాగార్జున తనకు అన్నయ్య అంటూ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అక్కినేని వారసుడిగా నాగార్జున సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అమ్మాయిల రాకూమారుడు అయ్యాడనే విషయం తెలిసిందే. మన్మథుడు, గ్రీకువీరుడు ఎలా ఉంటారో తెలియదు.. నాగార్జునను చూస్తే అలాగే ఉంటారేమో అనిపిస్తుంది చాలా మందికి. అయితే ఈ హీరోకు వయసు 60 ఏళ్లు దాటిన పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ.. అమ్మాయిలా మన్మధుడిగా నిలిచిపోయాడు. నాగ్ ఏం తింటాడో కానీ ఆయన్ని చూసి ఈ ఏజ్ లో కూడా ఇంత ఫిట్నెస్, ఇంత అందం ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తూంటారు.

Rajinikanth Jailer Actress Mirnaa Menon Post A Photo With Nagarjuna and She Calls Him Annayya Full Details Here

ఇక అమ్మాయిల్లో అయితే ఇప్పటికి కూడా నాగార్జునకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. అమ్మాయిలకి ఆయన మన్మధుడు, గ్రీకు వీరుడు... మరి ఏ అమ్మాయి నాగార్జునను అన్నయ్య అనదు.. అనాలను కోదు. కానీ తాజాగా రజినీ కాంత్ కోడలు నాగార్జునను అన్నయ్య్ అంటూ పోస్ట్ పెట్టింది. అయ్యా రజినీకాంత్ కు కోడలు లేదుగా ఎవరు ఆమె అనుకుంటున్నారా.... జైలర్ సినిమాలో రజినీ కాంత్ కోడలిగా హీరోయిన్ మీర్నా నటించిన సంగతి తెలిసిందే.

Rajinikanth Jailer Actress Mirnaa Menon Post A Photo With Nagarjuna and She Calls Him Annayya Full Details Here

ఈ మలయాళి భామ.. రజినీ కాంత్ కోడలిగా జైలర్ సినిమాలో అందరిని ఆకర్షించింది. ఇక ఈమెను బయట కూడా రజినీ కాంత్ కోడలు అంటూ సంబోధిస్తున్నారు. మరి అమ్మాయి.. నాగార్జునని అన్నయ్య అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మలయాళీ భామ మిర్నా మీనన్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. క్రేజీ ఫేలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అల్లరి నరేష్ సరసన ఉగ్రం సినిమాలో నటించి మెప్పించింది.

ఇప్పుడు సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగార్జున నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఉండగా.. ఆయన నాగార్జున ప్రాణ స్నేహితుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ కి జోడిగా మిర్నా మీనన్ నటిస్తుంది. తాజాగా నా సామిరంగ షూటింగ్ సెట్ లో నాగార్జునతో దిగిన ఓ ఫోటోని మిర్నా మీనన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మా అన్నయ్య కింగ్ నాగార్జున సర్ అంటూ రాసుకువచ్చింది.

Rajinikanth Jailer Actress Mirnaa Menon Post A Photo With Nagarjuna and She Calls Him Annayya Full Details Here

నాగార్జునని అన్నయ్య అనడంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నాగార్జునని అన్నయ్య అందంటే మాములు విషయం కాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ భార్యగా చేస్తుండటంతో నాగార్జునని అన్నయ్య అని పిలిచి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా నాగార్జునని అన్నయ్య అంటూ పోస్ట్ చేయడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక నా సామిరంగ సినిమా సంక్రాంతికి జనవరి 14న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X