కాలా రన్ టైం కాస్త ఎక్కువే... విడుదల తేది ఖరారు!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కాలా. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది.ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సట్టిఫికేట్ లభించింది. ఈ చిత్రంలో రజనీ కాంత్ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ కనిపించబోతున్నాడు.
కబాలి తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కాలా. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది.ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. వండర్ బార్ ఫిలింస్ బ్యానర్‌పై ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సట్టిఫికేట్ లభించింది. సినిమా నిడివి రెండు గంటలా నలభై నాలుగు నిమిషాలు ఉండడం విశేషం. రన్ టైం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. అయినా సరే సినిమా బాగుంటే రన్ టైం ఎక్కువగా ఉన్నా చూస్తున్నారు జనాలు.
ఈ మద్య విడుదలైన రంగస్థలం, మహానటి సినిమాలు కూడా ఎక్కువ నిడివితో విడుదలై మంచి విజయాలు సాధించాయి. అదే తరహాలో కాలా సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఈ చిత్రంలో రజనీ కాంత్ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











