»   » ఓటేసిన రజనీ, కమల్, అజిత్... సూర్య క్షమాపణ (పిక్చర్స్)

ఓటేసిన రజనీ, కమల్, అజిత్... సూర్య క్షమాపణ (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీతో పాటే కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో భాగంగా సోమవారం ఓటింగ్ ప్రారంభం అయింది. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ లాంటి స్టార్స్ తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు.

రజనీకాంత్ తన ఓటు హక్కును స్టెల్లా మేరీస్ కాలేజ్ లో, అజిత్ తన భార్య శాలినితో కలిసి కుప్పం బీచ్ రోడ్ లోని గవర్నమెంటు స్కూల్ లో, విజయ్ తన ఓటు హక్కును నీలంకరైలో వినియోగించుకున్నారు.

తన త్రిబాషా చిత్రం శభాష్ నాయుడు సినిమా షూటింగు వల్ల ఓటింగులో పాల్గొనక పోవచ్చని ప్రకటించిన కమల్ హాసన్... తన నిర్ణయం మార్చుకున్నారు. తేయనమ్ పేటలోని కార్పొరేషన్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమల్ హాసన్ తో పాటు ఆయన కూతురు అక్షర హాసన్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో యూఎస్ఏలో హాలిడేలో ఉన్న సూర్య మాత్రం ఓటింగును మిస్సయ్యారు. దీనిపై ఆయన క్షమాపణ కోరుతూ ఓ ప్రెస్ రిలీజ్ రిలీజ్ చేసారు. తొలిసారి ఓటు వేయడాన్ని మిస్సవుతున్నందుకు చాలా బాధగా ఉందని, తాను ఇక్కడి నుండి రాలేని పరిస్థితుల్లో ఉండటం వల్లే మిస్సవుతున్నానని, దీనికి నేను చాలా ఎంబరాసింగ్ గా ఫీలవుతున్నట్లు తెలిపారు.

అయితే సూర్య ఫాదర్ శివ కుమార్, ఆయన సోదరుడు కార్తి, ఇతర కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇరత తమిళ సినీ సెలబ్రిటీలే వివేక్, జీవా, గౌతమ్ మీనన్, రాధిక, ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్ తదితరులు ఓటింగులో పాల్గొన్నారు.

రజనీకాంత్

రజనీకాంత్

ఓటు హక్కు వినియోగించుకున్నరజనీకాంత్.

విజయ్

విజయ్

హీరో విజయ్ కూడా విధిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కమల్, అక్షర

కమల్, అక్షర

తన కూతురు అక్షర హాసన్ తో కలిసి కమల్ హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మీడియాతో..

మీడియాతో..

ఓటు వేసిన అనంతరం మీడియాకు సిరా గుర్తు చూపుతున్న కమల్, అక్షర

అజిత్, శాలిని

అజిత్, శాలిని

హీరో అజిత్ తన భార్య శాలినితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

శివకుమార్, కార్తి

శివకుమార్, కార్తి

తన తండ్రి శివకుమార్ తో కలిసి ఓటు వినియోగించుకుంటున్న కార్తి, ఇతర కుటుంబ సభ్యులు.

జీవా

జీవా

ఓటే వేసిన అనంతరం సిరా గుర్తు చూపుతున్న జీవా.

వివేక్

వివేక్

ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు చూపుతున్న వివేక్.

ఖుష్బూ, సుందర్

ఖుష్బూ, సుందర్

తన భర్త సుందర్ తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నటి ఖుష్బూ.

రాధిక

రాధిక

ఓటు హక్కు వినియోగించుకున్న రాధిక.

English summary
Superstar Rajinikanth, actor-filmmaker Kamal Haasan and Thala Ajith Kumar cast their votes on Monday (May 16) in the ongoing Tamil Nadu legislative assembly elections. While Rajinikanth cast his vote at Stella Maris College, Ajith along with his wife Shalini exercised their franchise at a government school on Kuppam Beach Road. Ilayathalapathy Vijay was in Neelankarai when he cast his vote.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu