రజనీకాంత్ వర్సెస్ సల్మాన్ ఖాన్
ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బాక్సీఫీసు వద్ద ఢీ కొనబోతున్నారు. ఈ ఇద్దరు నటిస్తున్న భారీ ప్రాజెక్టులు ఒకేసారి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. దీంతో ఈ సారి బాక్సాఫీసును ఎవరు రూల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
రజనీకాంత్ హీరోగా సౌందర్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కొచ్చాడయాన్'. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం తమిళంతో పాటు హిందీ, తెలుగు లాంటి మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో డిసెంబర్ 2012లో విడుదల కానుంది. ఈ చిత్రం రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని 12.12.12న విడుదలవుతోంది.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపిక పడుకొనె హీరోయిన్.
సల్మాన్ ఖాన్, సొనాక్షి సిన్హా జంటగా అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో సల్మాన్ సోదరుడు అర్భాజ్‌ఖాన్ నిర్మించిన 'దబాంగ్' చిత్రం సంచలనాత్మక విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ గా దబాంగ్ 2 చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి నిర్మాత అర్భాజ్ ఖానే దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











