నేడు రజనీకాంత్-లత పెళ్లి రోజు...(రేర్ ఫోటోలు)

By Bojja Kumar

చెన్నై: ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో పండగ రోజు. ఎందుకంటే ఈ రోజు(ఫిబ్రవరి 26) రజనీకాంత్-లత పెళ్లి రోజు. ఈ దంపతులు పెళ్లి ద్వారా ఏకమై సరిగ్గా నేటికి 33 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరం తన పెళ్లి రోజు సందర్భంగా రజనీకాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతూ ఉంటారు.

ఈసారి కూడా పెళ్లిరోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసారు. రజనీకాంత్ కూతుర్లు ఐశ్వర్య, సౌందర్య ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. మరో వైపు రజనీకాంత్ అభిమాన సంఘాలు ఈ వేడుకను సెలబ్రేట్ చేయడంతో పాటు పలు సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.

రజనీకాంత్-లత మధ్య పెళ్లికి దారి తీసిన అంశాలను పరిశీలిస్తే.... లత తన కాలేజ్ మేగజైన్ కోసం రజనీకాంత్‌ను ఇంటర్వ్యూ చేడానికి వెళ్లినప్పుడు ఈ ఇద్దరు తొలిసారిగా కలిసారు. తొలి పరిచయంలోనే వీరి మధ్య ప్రేమ వికసించింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. 33 సంవత్సరాల క్రితం వీరి వివాహం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది.

రజనీకాంత్ పెళ్లి రోజును పురస్కరించుకుని రజనీకాంత్-లతలకు సంబంధించిన కొన్ని అరుదైన, రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

తొలి కలయిక

తొలి కలయిక


లత తన కాలేజ్ మేగజైన్ కోసం రజనీకాంత్‌ను ఇంటర్వ్యూ చేడానికి వెళ్లినప్పుడు ఈ ఇద్దరు తొలిసారిగా కలిసారు.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

లవ్ ఎట్ ఫస్ట్ సైట్


తొలి పరిచయంలోనే వీరి మధ్య ప్రేమ వికసించింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

తిరుమలలో వివాహం

తిరుమలలో వివాహం


33 సంవత్సరాల క్రితం రజనీకాంత్-లత వివాహం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది.

ప్రముఖుల హాజరు

ప్రముఖుల హాజరు


ఈ పెళ్లి వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఉత్తమ దంపతులు

ఉత్తమ దంపతులు


రజనీకాంత్, లత తమిళ సినీ పరిశ్రమలో ఉత్తమ సెలబ్రిటీ దంపతులుగా పేరొందారు.

అన్యోన్య దాంపత్యం

అన్యోన్య దాంపత్యం


32 సంవత్సరాలుగా ఈ దంపతులు అన్యోన్య జీవితం గడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు.

లత

లత


రజనీకాంత్ భార్య లత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఇంగ్లిష్ లిటరేచర్ పూర్తి చేసారు.

లత ఇతర వ్యవహారాలు

లత ఇతర వ్యవహారాలు


చెన్నైలోని ఆశ్రమ్ పాఠశాలకు లత ఫౌండర్, కరస్పాండెంట్. అదే విధంగా తన కూతురు సౌందర్యరజనీకాంత్ స్థాపించిన ప్రొడక్షన్ కంపెనీకి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తోంది.

సింగర్ గా లత

సింగర్ గా లత


1980ల్లో లత తమిళ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్ గా పని చేసారు.

రజనీ 25

రజనీ 25


రజనీకాంత్ 25 సంవత్సరాల కెరీర్ పూర్తయిన సందర్భంగా విడుదలైన చేసిన ‘రజనీ 25' మ్యూజిక్ ఆల్బమ్ ని ఆమె కంట్రిబ్యూట్ చేసారు.

సంతానం

సంతానం


రజనీకాంత్-లత దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్దకూతురు పేరు ఐశ్వర్య. తమిళ నటుడు ధనుష్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

కూతురు ఐశ్వర్య

కూతురు ఐశ్వర్య


ఐశ్వర్య 3 అనే సినిమా ద్వారా దర్శకురాలిగా కెరీర్ మొదలు పెట్టింది. ఇందులో తన భర్త ధనుష్ హీరోగా నటించాడు.

చిన్న కూతురు సౌందర్య

చిన్న కూతురు సౌందర్య


రజనీ చిన్న కూతురు సౌందర్య బిజినెస్ మేన్ అశ్విన్ ను పెళ్లాడింది.

సౌందర్య కూడా దర్శకురాలిగా

సౌందర్య కూడా దర్శకురాలిగా


ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కొచ్చాడయాన్' ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయం కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X