రాజమౌళి, సుదీప్‌లపై రజనీకాంత్ కామెంట్స్
ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రం చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు. చెన్నయ్‌లో ఇటీవల రాజమౌళి 'ఈగ' స్పెషల్ షో వేశారు. ఈ షోకు రజనీకాంత్‌తో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. రాజమౌళి అండ్ అతని టీమ్ గొప్ప పనితనం చూపించారు. ముఖ్యంగా సుదీప్ నటన అద్భుతంగా ఉంది. ఈగకు సరైన విలన్‌ను వెతికి పట్టుకున్నావు అని రాజమౌళితో అన్నారు రజనీ. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు జక్కన్న.
రజనీతో పాటు 'ఈగ' చిత్రం చూసిన సినీ సెలబ్రిటీలంతా రాజమౌళి టాలెంట్‌కు హాట్సాఫ్ అంటున్నారు. రాజమౌళితో సమానంగా కన్నడ యాక్టర్ సుదీప్ నటనకు మార్కులు పడుతుండటం గమనార్హం. కన్నడ హీరో అయిన సుదీప్ తొలిసారి విలన్‌గా నటించాడు. తొలి ప్రయత్నంలోనే సూపర్ అనిపించుకున్నాడు.
ఈ చిత్రంలో సుదీప్ క్రూరమైన మనస్తత్వంగల పాత్రలో నటించాడు. అమ్మాయిలను చూస్తే కామంతో రగిలిపోయే పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతని కన్ను సమంతపై పడుతుంది. తనకు అడ్డుగా ఉన్న నానిని చంపేస్తాడు. నాని ఈగ రూపంలో వచ్చి అతని కామానికి తన ప్రియురాలు బలికాకుండా కాపాడుతాడు.
ఏమైతైనేం...సినిమా పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ తెలుగు సినిమాను రాజమౌళి హాలీవుడ్ సినిమాల రేంజికి తీసుకెళ్లడం నిజంగా అభినందించదగ్గ విషయం. రోటీన్ మూస సినిమాలను నమ్ముకోకుండా ఇలాంటి వెరైటీ ఆలోచనలు చేసినప్పుడే తెలుగు సినిమా ఖ్యాతి పెరుగుతుంది.


Click it and Unblock the Notifications











