నిజమా? రజనీ అభిమానుల కోసం రూ. 300 కోట్లు?
హైదరాబాద్: అభిమానుల అండతో ఎదిగాం....వారి కోసం ఏదైనా చేయాలనే తపన పడే వారిలో రజనీకాంత్ ఒకరు. తాజాగా ఆయన అభిమానుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం రూ. 300 కోట్లతో నిధి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నిధులతో సినిమాలు తీసి....వచ్చిన లాభాలను అభిమానుల సంక్షేమ నిధికి మళ్లించనున్నారట. మరి రజనీకాంత్ ఆలోచన ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది తేలాల్సి ఉంది. అయితే రాజనీకాంత్ ఈ ఆలోచన చేయడం వెనక రాజకీయ పరమైన ఆలోచన ఉందని అంటున్నారు.

త్వరలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని...అందులో భాగంగానే అభిమానుల కోసం ఈ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు అంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు, బురద చల్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











