ఈ ఫాలోయింగ్ ఏ హీరోకి లేదు...ఇక రాదు

By Srikanya

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లోనే కాదు... సోషల్‌ నెట్‌వర్కింగ్‌ మీడియాలోనూ తన హవా చాటుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ట్విట్టర్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేయగానే నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ట్విట్టర్‌లో ఆయన తొలి ట్వీట్‌ చేసినప్పటి నుంచి ఫాలోవర్స్‌ క్యూ కడుతున్నారు. కేవలం 8 గంటల్లోనే ఆయన అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షా 50 వేలు దాటింది రెండు లక్షలకు చేరువలో ఉంది. ఈ ఫాలోయింగ్ చూసిన వాళ్ళు నోరెళ్లపెడుతున్నారు. ఇలాంటి ఫాలోయింగ్...ఏ హీరోకి ఇంతవరకూ లేదు..ఇక రాదు అని చెప్తున్నారు. ఈ ఫాలోవర్స్ సంఖ్య ఎంతకి చేరుతుందో అని అంచనాలు వేస్తున్నారు.

ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ ట్విట్టర్‌లో చేరారు. 'దేవుడికి మనఃపూర్వక అభినందనలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ డిజిటల్‌ ప్రయాణం ఉద్వేగంగా ఉంది' అంటూ సోమవారం ఆయన తొలి ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌ ట్విట్టర్‌లో చేరారని తెలియగానే అభిమానుల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఆయన సందేశాన్ని రీట్వీట్‌ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకొన్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షమందికి పైగా ఆయన్ని అనుసరించారు.

Rajinikanth makes Twitter debut, nears 2 lakh followers

స్టార్ హీరో,హీరోయిన్స్ సైతం రజనీకాంత్‌ ట్విట్టర్‌లో చేరటం గురించి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు తమ అభిమాన హీరోల తో మాట్లాడటం ప్రేక్షకులకు ఓ కలగానే మిగిలిపోయేది. కానీ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక తారల్ని నేరుగా పలకరిస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ప్రముఖ తారలెంతోమంది ట్విట్టర్‌లో చేరారు.

అమితాబ్‌లాంటి అగ్ర నటుడు కూడా ట్విట్టర్‌లో ఉన్నారు. ఆయన నిత్యం అభిమానులకు ట్విట్టర్‌లో అందుబాటులో ఉంటారు. మంచి చెడులను ట్విట్టర్‌ వేదికగా పంచుకొంటుంటారు. తాజాగా రజనీకాంత్‌ ట్విట్టర్‌లో చేరడం ఆయన అభిమానులకి ఎంతో సంతోషాన్నిచ్చింది. రజనీ నటించిన 'కోచ్చడయాన్‌' చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో ఆ చిత్రం 'విక్రమసింహ' పేరుతో విడుదలవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X