టాలీవుడ్ బుడ్డా రీమేక్ కి పూరి ప్లాన్...!

By Sindhu

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కి విజయవంతమైన హిందీ చిత్రం 'బుడ్డా హోగా తేరా బాప్". ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అమితాబ్ బాడీ లాంగ్వేజ్‌ కు, వయసుకు సరిపడినట్లు స్క్రిప్టును సిద్ధం చేసుకుని బాలీవుడ్ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న పూరీ జగన్నాథ్ ఇపుడు రజినీకాంత్‌ హీరోగా ఈ చిత్రాన్ని తమళంలో చేయాలనుకుంటున్నట్లు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.

'రానా" పూజాకార్యక్రమాలు నిర్వహించిన రోజే రజనీకాంత్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత రజనీ చికిత్స కోసం సింగపూర్ వెళ్లడంతో తాత్కాలికంగా ఆగిపోయిన 'రానా" షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని రజనీ అభిమానులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. చికిత్స ముగించు కొని సింగపూర్‌ లో గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్న రజనీకాంత్ ఈ నెల 13న చ్నై తిరిగి వచ్చారు.

అయితే అర్థాంతరంగా ఆగిపోయిన 'రానా" షూటింగ్ అక్టోబర్‌ లో ప్రారంభం అవుతుందని, అంత వరకు కెళంబాక్కమ్ ఫామ్ హౌస్‌ లో రజనీ విశ్రాంతి తీసుకుంటారని రజనీకి అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం పూర్తయ్యాక బుడ్డా చిత్రాన్ని రజినీతో చేయాలని పూరీ అనుకుంటున్నట్లు భోగట్టా. రజినీ ఓకే అంటే ఇక టాలీవుడ్ బుడ్డా తెరకెక్కడమే తరువాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X