రజనీకాంత్ దెబ్బకు జాకీచాన్ అవుట్.. అది రెమ్యునరేషనా లేక అణుబాంబా, ఆసియాలోనే!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుత వయసు 67 ఏళ్ళు. ఇప్పటికి పేరుగాంచిన కుర్ర హీరోలు ఎవరూ రజనీకాంత్ తో పోటీ పడలేరు. తాజాగా రజనీకాంత్ అందుకుంటున్నా రెమ్యునరేషన్ గురించి తెలిస్తే తలైవతో పోటీ అనే విషయం కలలోకి కూడా రాదేమో. రజనీకాంత్ ఇండియాలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుడు. రజనీకాంత్ రెమ్యునరేషన్ గురించి తాజాగా అందుతున్న వార్త సినీవర్గాలు, అభిమానులని ఆశ్చర్యంలో ముంచెత్తే విధంగా ఉంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించే సమయం ఆసన్నమైనా కూడా తలైవా స్టామినా తగ్గడం లేదు. వయసు పెరిగే కొద్ది రజనీకాంత్ స్థాయి అంతకంతకు పెరుగుతోంది.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో

రజనీకాంత్ తదుపరి చిత్ర మెర్క్యురీ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతోంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి గాను రజని కళ్ళు చెదిరే పారితోషకం అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి రజనీకాంత్ కు సన్ పిక్చర్స్ 65 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే భారత చలనచిత్ర చరిత్రలో నయా సంచలనం అని చెప్పొచ్చు.

శివాజీ చిత్రంతో మొదలు

శివాజీ చిత్రంతో మొదలు

రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ చిత్రంతో ఆసియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న రెండవ నటుడిగా రజని అవతరించారు. ఆసియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుడు జాకీచాన్.

జాకీచాన్ రికార్డు గల్లంతు

జాకీచాన్ రికార్డు గల్లంతు

కార్తీక్ సుబ్బరాజ్ చిత్రానికి రజనీ 65 కోట్లు పారితోషకం అందుకుంటే ఆసియాలో నెం 1 హీరోగా రజనీ రికార్డు సృష్టిస్తాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనితో జాకీచాన్ రికార్డు గల్లంతు అవుతుంది.

కేవలం 40 రోజులకే

కేవలం 40 రోజులకే

65 కోట్ల రెమ్యునరేషన్ అదనుకుంటున్న రజనీ కాంత్ ఈ చిత్రానికి కేటాయించింది కేవలం 40 రోజుల కాల్ షీట్లేనట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రజని స్థాయి ఏంటో. జూన్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది.

బ్లాక్ బస్టర్ కాంబినేషన్

బ్లాక్ బస్టర్ కాంబినేషన్

రజనీకాంత్, సన్ పిక్చర్స్ కాంబినేషన్ లో ఇప్పటికే రోబో వంటి భారీ చిత్రం వచ్చింది. రోబో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అందుకే రజని, కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంపై కూడా సన్ పిక్చర్స్ భారీ ఆశలు పెట్టుకుని ఉంది.

రెండు భారీ చిత్రాలతో రజని

రెండు భారీ చిత్రాలతో రజని

రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. రజని ఇప్పటికే 2.0, కాలా చిత్రాల్లో నటించారు. కాలా చిత్రం జూన్ 7 విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంద. 2.0 చిత్ర విషయంలో మాత్రం ఎటువంటి సమాచారం అందడంలేదు. ఈ చిత్రం 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X