For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రజినీ కాంత్ బిచ్చగాడిలా కనిపించాడా..!? సూపర్ స్టార్ ని వృద్దాశ్రమానికి పంపమంటూ ప్రభుత్వానికి వినతి

|

ఎన్నో అంచనాలతో భారీ గా విడుదలైన కబాలి నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం దూసుకు పోతూనే ఉంది. విదేశాల్లో సైతం ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజం పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'కబాలి' అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. రివ్యూలు ఎలా వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ తలైవా స్టామినా ఏమిటో చాటుతోంది.ఆ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యువకుడు కబాలి విషయం లో తాను మోసపోయాననీ, రజినీ ప్రమాదం లో ఉన్నాడనీ ఆయనని కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.

మరో విషయం ఏమిటంటే రజినీ జీవితం లోని ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రముఖ వైద్యురాలు గాయత్రి రాసిన పుస్తకం లో రజినీ గుడిముందు బిచ్చగాడిలా కనిపించటం తో ఓ మహిళ ఆయనకు బిక్షం వేసిన విషయాన్నీ బయట పెట్టారు. అసలు విషయాలేమిటో స్లైడ్ షోలో...

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

రజనీకాంత్ ను తమిళ నిర్మాతల నుంచి కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చాలంటూ చెన్నై వడపళినికి చెందిన కందస్వామి అనే వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ కు రెండురోజుల క్రితం ఓ వినతిపత్రం సమర్పించాడు.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

66 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ అయిన రజనీకాంత్‌ చేత విచిత్రమైన ఫైట్లు చేయించి దర్శకుడు, నిర్మాత తనను చిత్రవధ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే రజనీకాంత్‌ను వృద్ధాశ్రమానికి పంపాలని పోలీస్‌ కమిషనర్‌కు ఓ వినతిపత్రం ఇచ్చాడు.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

కబాలి' సినిమా విడుదల ముందు నుండే సంచలనాలు క్రియేట్ చేసింది. బహుషా ఈ సినిమాకు వచ్చినంత క్రేజ్ సౌత్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాలేదేమో. మరో వైపు సినిమా విడుదల ముందు రజనీకాంత్ అమెరికా వెళ్లడం, ఆయన ఆరోగ్యంపై అనేక రూమర్స్ వినిపించడం తెలిసిందే.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

ఒకానొక సందర్భంలో రజనీకాంత్ అనారోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటం, ఆడియో వేడుక కూడా రద్దు చేయడంతో అభిమానుల్లో తెలియని ఆందోళన. రజనీ పరిస్థితి బాగోలేదు, సినిమా రిలీజ్ అవుతుందో? లేదో? అనే వార్తలు అభిమానులకు ఆ మధ్య నిద్ర లేకుండా చేసాయి. రజనీ కుటుంబం మొత్తం అమెరికా వెళ్లడం కూడా ఈ అనుమానాలకు మరింత బాలాన్ని ఇచ్చింది.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికే అమెరికా వెళ్లానని, ఇపుడు పూర్తి ఆరోగ్యంతో ఉత్సాహంగా చెన్నైకి తిరిగొచ్చానని రజనీకాంత్ చెప్పటం తో అంతాకూల్ అయ్యారు.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

అయితే ఇప్పుడు కందస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన వినతి పత్రం లో ఆయన ఆరొగ్యం బాగాలేకపోయినా., 66 ఏళ్ళ వృద్దాప్యం లో ఉన్నా నిర్మాతలు ఆయనను వదలటం లేదనీ... తెర మీద వింత వింత విన్యాసాలు చేయించి ఆయనని హింసిస్తున్నారనీ ఆయని వృద్దాశ్రమం లో చేర్చాలి అంటూ పేర్కొనటం... ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేపింది. ఇదికావాలనే రజినీని వెటకారం చేసినట్టుందని అనుకుంటున్నారు.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

‘విపరీతమైన ప్రచారం చేసి ‘కబాలి'పై ఆసక్తి రేకెత్తించారు. దాంతో చెన్నైలోని ఓ థియేటర్‌లో రూ.1200 పెట్టి టికెట్‌ కొని సినిమా చూశా. అయితే హీరో రజనీ, దర్శకుడు పా.రంజిత్‌ నన్ను మోసం చేశారు. వృద్ధుడైన వ్యక్తి చేత చిత్రవిచిత్ర విన్యాసాలు చేయించి నాకు జుగుప్స కలిగించారు. తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా తమిళ నిర్మాతల నుంచి రజనీని కాపాడి ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండ'ని ఆ వినతి పత్రంలో పేర్కొన్నాడు కందస్వామి.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

ఇదంతా ఇలా ఉండగా రజినీ జీవితం లోని ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రముఖ వైద్యురాలు గాయత్రి రాసిన పుస్తకం ఇప్పుడు ఇంకో సంచలనానికి దారి తీస్తోంది.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

పుస్తకం లో ఒక సంఘటనని ఆమె ఇలా వివరించారు.సూపర్ స్టార్ గా ఒక ఊపు ఊపుతున్నప్పుడే. ఒక సారి ముతక పంచె, తెల్ల చొక్క తో ఒక దేవాలయనికి వెళ్ళిన రజని కారు ని గుడికి దూరంగా అపి అక్కడ నుంచి కాలి నడక వెళ్ళి దర్శనం చెసుకొని గుడిలో ఆయన ఒక స్తంభం దగ్గర కూర్చున్నాడు. మామూలు పంచె, చెరిగిన జుత్తు, మాసిన గెడ్డంతో స్తంభం దగ్గర కూర్చుని ఉన్న రజనీని చూసి ఒక గుజరాతీ మహిళ..

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

ఆయనను బిచ్చగాడు అనుకుంది. ఇంకేముంది, బిచ్చగాడికి దానం చేస్తే పుణ్యం వస్తుందనుకుందో ఏమో.. రజనీకి పది రూపాయలు దానం చేసింది. రజనీ ఏమీ మాట్లాడుకుండా ఆమె ఇచ్చిన పది రూపాయలు తీసుకున్నాడు. నిజంగా తనకు ఆమె బిక్షం వేసిందీ అని తెలిసి కూడా అవమానం గా ఫీలవకుండా ఆదబ్బుని జేబులో వేసుకున్నాడు.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

అయితే అక్కడే ఉన్న కొంతమంది నువ్వు బిక్షం వేసింది ఎవరికో తెలుసా..!? అంటూ అసలు విషయం చెప్పటం తో ఆమె రజినీని క్షమాపన కోరింది. అయితే, రజనీ మాత్రం ఆమెను ఓదార్చుతూ, తాను సూపర్ స్టార్‌ని కాదని, మామూలు మనిషినని, ఈ మాట దేవుడు ఆమెతో చెప్పించాడని, ఆమె ఇచ్చిన పదిరూపాయలకు మరో పది లక్షలు కలిపి ఒక అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చాడట.

రజినీ కాంత్ బిచ్చాగాడిలా కనిపించాడా..!?

ఈ పుస్తకం వచ్చి చాలా రోజులే అయినా ఈ సంఘటన ఉన్న సంగతి ఇప్పుడు బయతకు రావటం తో రజినీ అభిమానులు ఈ పుస్తకం కోసం ఎగబడుతున్నారు. "నేం ఈజ్ రజినీకాంత్" పేరుతో 2008 లో వచ్చిన ఈ పుస్తకం ఇప్పుడు ఆన్ లైన్ లో హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ కి ఈ పుస్తకం కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయట...

English summary
It is said that once when Rajinikanth was inside a temple in his usual simple dress, he sat down near a pillar for sometime. A lady in her 40's, who didn't know about Rajinikanth, crossed the star actor. Looking at him, she mistook the star for a beggar and offered him 10 rupees to him
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more