twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rajinikanth pethanna teaser: వాడికి అడ్డు లేదు.. ఉప్పెన రా!.. తలైవా బ్లాస్ట్ మామూలుగా లేదు

    |

    సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలం తర్వాత మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిమాన ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తూ వస్తున్న ఈ సారి కూడా మాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. తమిళంలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన అన్నత్తై సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో పెద్దన్న అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇక నేడు సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్ ను కూడా విడుదల చేశారు టీజర్ లో రజనీకాంత్ సరికొత్త గా కనిపిస్తున్నాడు.

    తెలుగులో పట్టు కోల్పోతున్న తలైవా

    తెలుగులో పట్టు కోల్పోతున్న తలైవా

    పెద్దన్న సినిమాతో రజనీకాంత్ ఎలాగైనా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా తెలుగులో ఆయనకు సరైన విజయాలు లేవు. చివరగా కబాలి సినిమా తో మాత్రమే తమిళ్ తెలుగు లో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఆ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. చివరగా వచ్చిన దర్బార్ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. తమిళంలో కూడా ఆ సినిమాకు సరైన వసూళ్లు అయితే రాలేదు.

    పెద్దన్న పవర్ఫుల్ టీజర్..

    పెద్దన్న పవర్ఫుల్ టీజర్..

    పెద్దన్న సినిమాతో రజినీకాంత్ ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్ ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది ఇంతకుముందే తమిళంలో టీజర్ విడుదల చేయగా ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. రజినీకాంత్ ఎప్పటిలానే తన సరికొత్త స్టైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మాస్ హీరోగా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉన్నాయి.

    ఉప్పెన రా..

    ఉప్పెన రా..

    పల్లెటూరోడ్ని శాతంగానే చూసి ఉంటావు.. కోప్పడి చూడలేదు కదా.. ఉప్పెన రా.. వాడికి అడ్డు లేదు ఒడ్డు లేదు.. అంటూ రజనీకాంత్ అదిరిపోయే డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోసారి ఫ్యాన్స్ చేత చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి. అంతేకాకుండా సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని అనిపిస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్ బైక్ పై కత్తి పట్టుకుని రావడం చాలా స్టైలిష్ గా ఉంది. అలాగే ఫ్యామిలీ ప్రేక్షకులకి కూడా పెద్దన్న సినిమా అద్భుతంగా నచ్చుతుంది అని అర్థమవుతోంది.

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?

    తెలుగులో ఈ సినిమాకు మొదట అనుకున్నంత స్థాయిలో అయితే బిజినెస్ జరగలేదు. ఇక ఫైనల్ గా సినిమాను తెలుగు డబ్బింగ్ హక్కులను 12 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. అంటే రజినీకాంత్ తెలుగులో 12.5 కోట్ల వరకు షేర్ సాధిస్తేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క. గత కొంతకాలంగా వరుస అపజయాలతో కొనసాగుతున్న రజినీకాంత్ కు తెలుగు మార్కెట్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. మరి ఈ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటారో చూడాలి ఇక ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా కుష్బూ, మీనా, కీర్తి సురేష్, జగపతిబాబు , ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Rajinikanth pethanna telugu official teaser
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X