twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పేట' ట్విట్టర్ రివ్యూ : చాలా రోజుల తర్వాత అసలైన రజని.. క్లైమాక్స్ ట్విస్ట్ కేక!

    |

    Recommended Video

    Petta Twitter Review: What The Audiences Feel About Movie

    సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత ఏడాది కాలా, 2.0 చిత్రాలతో అభిమానులని అలరించిన రజని, కొత్త సంవత్సరంలో త్వరగానే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. విభిన్న చిత్రాలతో తన ప్రతిభ చాటుకున్న కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఆసక్తి నెలకొంది. రజనీకాంత్ సరసన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో రజనీకాంత్ స్టైలిష్ గా, ఎనర్జిటిక్ ఆటిట్యూడ్ తో కనిపించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.

    చాలా రోజుల తర్వాత

    చాలా రోజుల తర్వాత అసలు సిసలైన రజనీకాంత్ సినిమా చూశా. సినిమా మొత్తం ఎంజాయ్ చేశా. ఇలాంటి అద్భుతమైన అనుభూతిని కలిగించే చిత్రాన్ని అందించిన కార్తీక్ సుబ్బరాజ్ కు థాంక్స్.

    ఒక్కమాటలో చెప్పాలంటే

    పేట చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ప్రేము మాస్. తలైవర్ అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. విజయ్ సేతుపతి నటన బావుంది. కార్తీక్ సుబ్బరాజ్, అనిరుద్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు.

    ఫస్ట్ హాఫ్ కేక

    దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పాత రజినీకాంత్ ని చూపిస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ కేక పెట్టించే విధంగా ఉంది.

    క్లైమాక్స్ ట్విస్ట్

    బ్లాక్ బస్టర్ పేట..ఇది సూపర్ స్టార్ పండగ సినిమా.. క్లైమాక్స్ ట్విస్ట్ మరణ మాస్ అనిపించే విధంగా ఉంది.

    మాస్, క్లాస్ అన్నీ

    పేట చిత్రంలో మాస్, క్లాస్, రొమాన్స్, ఎమోషన్ అన్ని అంశాలు ఉన్నాయి. నా చిన్న తనంలో సూపర్ హీరోలా చూసిన రజనీని మళ్ళీ చూస్తున్నా. ఇది కంప్లీట్ రజని మూవీ.

    నరసింహ, భాషా.. ఇప్పుడు పేట

    భాషా, నరసింహ చిత్రాల తర్వాత చాలా రోజులకు ప్రతి ఒక్క రజని అభిమాని కల నెరవేరింది. ఇది అల్టిమేట్ సూపర్ హీరో రజని చిత్రం. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అన్ని అంశాలని చక్కగా పొందుపరిచారు.

    శివాజీ తర్వాత

    వాట్ ఎ మూవీ.. సినిమా ఎఫెక్ట్ నుంచి నేను ఇంకా బయట పడలేదు. శివాజీ తర్వాత ఇది మరణ మాస్ ఫిలిం.. వావ్.

    క్లైమాక్స్ కోసం

    పేట క్లైమాక్స్ కోసం రిపీట్ గా చూడొచ్చు. తీవ్ర ఉత్కంఠ.. హై ఎనర్జీతో రజనీకాంత్ ఉన్నారు. ఆయన సూపర్ స్టార్ మాత్రమే కాదు.. అద్భుత నటుడు కూడా.

    అడిగిన దానికంటే ఎక్కువగా

    మీరు రజనీకాంత్ తో మాస్టర్ పీస్ చిత్రాన్ని అందించారు. అభిమానులు ఆశించినదానికంటే ఎక్కువగానే పేట చిత్రం ఉంది. థాంక్యూ బ్రో కార్తీక్ సుబ్బరాజ్.

    విజయ్ సేతుపతికి హ్యాట్సాఫ్

    వాట్ ఎ రోల్.. పేట చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర అద్భుతంగా ఉంది. బోల్డ్ రోల్ చేసినందుకు విజయ్ సేతుపతికి హ్యాట్సాఫ్.

    English summary
    Rajinikanth Petta movie Twitter Review and Premier show Talk
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X