అతిధి పాత్రలో కనిపించటానికి కమిటైన రజనీకాంత్...
'రోబో" ఘన విజంయతో తన సత్తా ఏంటో మరోసారి భాక్సాఫీస్ కు చూపించిన రజనీకాంత్ తాజాగా 'జోగయ్య" అనే కన్నడ చిత్రంలో గెస్ట్ రోల్ చేయటానికి కమిటయ్యారు. శివరాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆ హీరోది వందో చిత్రం. తెలుగులో ఇడియట్ చిత్రం చేసిన రక్షిత భర్త ప్రేమ్ ఈ చిత్రం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రజనీకాంత్ తో సహా చిరంజీవి, తమిళ హీరోలు విజయ్, సూర్య పాల్గొన్నారు.జోగయ్య చిత్రంలో అతిథి పాత్ర పోషించాల్సిందిగా శివరాజ్‌కుమార్ రజనీని కోరగానే తన కాల్షీట్ ఎప్పుడు కావాలో చెప్పండని అన్నారట. మరో వారంలో ఆయనకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించవచ్చునని తెలిసింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం తొలుత నయనతారను వరించింది. ఆమెకు కోటి రూపాయల పారితోషికం ఇస్తామన్నా కానీ ఆమె వ్యక్తిగత, ఇతరత్రా కారణాలవల్ల ఆ అవకాశాన్ని తిరస్కరించింది.


Click it and Unblock the Notifications











