'నీలాంటి డైరెక్టర్ లేరయ్యా' అంటూ రజనీకాంత్ ముద్దు పెట్టారు
'ఇండియాలో నీలాంటి డైరెక్టర్ లేరయ్యా' అని రజనీకాంత్ కావలించుకుని, ముద్దు పెట్టుకున్నారు. నా జీవితంలో గొప్ప క్షణాలేవంటే రజనీకాంత్ ప్రశంసించడమే అని మురిసిపోతూ చెప్తున్నారు ప్రముఖ కన్నడ దర్శకుడు,హీరో అయిన ఉపేంద్ర. హీరోగా నటిస్తూ ఉపేంద్ర దర్శకత్వం వహించగా కన్నడంలో ఘనవిజయం సాధించిన 'సూపర్' చిత్రం తెలుగులో డబ్బింగై మార్చి మొదటి వారంలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన చిత్రం చూసి రజనీకాంత్ మెచ్చుకున్నారంటూ ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రం గురించి చెబుతూ..ఇది భవిష్యత్తుకు సంబంధించిన చిత్రం. ఇది 2030లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోందనే ఊహకు తెరరూపం అన్నారు. అలీ, జీవా, సాధుకోకిల, నాగేంద్ర షా, రాక్‌లైన్ వెంకటేశ్, శైలశ్రీ, శ్వేత, సుదర్శన్ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి, సంగీతం: హరికృష్ణ, సినిమాటోగ్రఫీ: అశోక్ కాశ్యప్, జానీ లాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉపేంద్ర.


Click it and Unblock the Notifications











