రజనీ అభిమానులకు శుభవార్త
నిజంగా ఇది రజనీ అభిమానులకు శుభవార్తే. రోబో తర్వాత రజనీ నటిస్తున్న సినిమా రాణా. సినిమా షూటింగు రోజే సూపర్ స్టార్ అనారోగ్యం పాలవడంతో సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం రజినీ పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ మొదలు పెట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయాన్ని రజనీ చిన్న కూతురు సౌందర్య కన్ ఫర్మ్ చేశారు. సినిమాను నిలిపి వేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మ వద్దని, రాణా సినిమాలో నాన్న నటిస్తున్నారని స్పష్టం చేశారు.
రాణా సినిమాకు కె.ఎస్. రవి కుమార్ దర్శకుడు. రజనీ సరసన బాలీవుడ్ భామ దీపిక పడుకొనె నటిస్తోంది. ఇది వరకు వచ్చిన రోబో సినిమా రేంజ్ లో భారీ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రజనీ కూతురు సౌందర్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ రత్నవేలు, సంగీతం ఎ.ఆర్. రెహమాన్. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుల కానుంది.


Click it and Unblock the Notifications











