Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
‘సుడిగాడు’కి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు
హైదరాబాద్ : అల్లరి నరేష్ హీరోగా స్టార్ హీరోలను పేరడీ చేస్తూ రూపొందిన 'సుడిగాడు' చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపిస్తోంది ఈచిత్రం. ఇప్పటికే ఈచిత్రానికి పలువురు సినీస్టార్ల ప్రశంసలు అందాయి. తాజాగా ఈచిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్.
సుడిగాడు ఫిల్మ్ యూనిట్ సుడిగాడు స్పెషల్ షోను ఆయన నివాసంలో సెప్టెంబర్ 5న ఏర్పాటు చేసారు. సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ వండర్ ఫుల్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అదే విధంగా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు పనితీరును మెచ్చుకున్నారు.
అల్లరి నరేష్ తన గత సినిమాల్లో అడపా దడపా పెద్ద హీరోలను అనుకరించినా పూర్తి పేరడీ సినిమా చెయ్యలేదు. ఆ లోటుని ఈ చిత్రంతో భర్తీ చేసారు, ఈ చిత్రంలో సుమారు టాలీవుడ్ టాప్ 100 సినిమాల్లోని సన్నివేషాలను తీసుకొని పేరడీ చేసారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని సూపర్ హిట్ సినిమాల్లోని సన్నివేశాలను ప్రేక్షకులు నవ్వుకునేలా పేరడీ చేయడం ఈ చిత్రంలో హైలైట్.
అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం: శ్రీవసంత్, పాటలు: సిరివెనె్నల, చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: విజయ్ ఉలగనాథ్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: డి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.