twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సుడిగాడు’కి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అల్లరి నరేష్ హీరోగా స్టార్ హీరోలను పేరడీ చేస్తూ రూపొందిన 'సుడిగాడు' చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపిస్తోంది ఈచిత్రం. ఇప్పటికే ఈచిత్రానికి పలువురు సినీస్టార్ల ప్రశంసలు అందాయి. తాజాగా ఈచిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్.

    సుడిగాడు ఫిల్మ్ యూనిట్ సుడిగాడు స్పెషల్ షోను ఆయన నివాసంలో సెప్టెంబర్ 5న ఏర్పాటు చేసారు. సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ వండర్ ఫుల్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అదే విధంగా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు పనితీరును మెచ్చుకున్నారు.

    అల్లరి నరేష్ తన గత సినిమాల్లో అడపా దడపా పెద్ద హీరోలను అనుకరించినా పూర్తి పేరడీ సినిమా చెయ్యలేదు. ఆ లోటుని ఈ చిత్రంతో భర్తీ చేసారు, ఈ చిత్రంలో సుమారు టాలీవుడ్ టాప్ 100 సినిమాల్లోని సన్నివేషాలను తీసుకొని పేరడీ చేసారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని సూపర్ హిట్ సినిమాల్లోని సన్నివేశాలను ప్రేక్షకులు నవ్వుకునేలా పేరడీ చేయడం ఈ చిత్రంలో హైలైట్.

    అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం: శ్రీవసంత్, పాటలు: సిరివెనె్నల, చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: విజయ్ ఉలగనాథ్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: డి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

    English summary
    Allari Naresh's latest movie Sudigadu has rocked the film goers across the globe and proved hit at the Box Office. Several stars have praised the Telugu actor for his wonderful acting in the film. The latest appreciation is coming from none other than Tamil superstar Rajinikanth, who could not stop raving him. According to reports, he saw the film via digital screening at his home.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X