For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీర్లు పొంగించి హీరోయిన్లతో ఎంజాయ్ చేశా.. రజినీ రియాక్షన్ ఇది: వర్మ

|

ఎన్నడూ లేని విధంగా రామ్ గోపాల్ వర్మ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడూ మరొకరి సినిమాను ప్రమోట్ చేయడం లాంటి పనులు చేయని వర్మ.. శిష్యుడు పూరి జగన్నాథ్ సినిమాను మాత్రం తెగ పొగిడేస్తున్నారు. విడుదలకు ముందు ట్రైలర్ చుసిన నాటి నుంచే ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ప్రశంసలు కురిపించిన వర్మ.. శనివారం రోజు ఇస్మార్ట్ శంకర్ టీమ్ తో చేసిన సందడి అంతా ఇంతా కాదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ లతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. అయితే అదే వీడియోపై రజినీకాంత్ రియాక్షన్ ఇది అంటూ మరో వీడియో పోస్ట్ చేశాడు వర్మ. ఇంతకీ రజినీ రియాక్షన్ ఏంటి? వర్మ పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఏముంది? వివరాల్లోకి పోతే..

శ్రీరాములు థియేటర్‌లో వర్మ

శ్రీరాములు థియేటర్‌లో వర్మ

ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ చేరుకున్న వర్మ.. థియేటర్ కి వచ్చేటప్పుడే హంగామా స్టార్ట్ చేశాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ మాస్ మసాలా పవర్ చూసి ఆ తర్వాత ఫుల్లుగా రెచ్చిపోయాడు. థియేటర్ లోనే ఇస్మార్ట్ టీమ్ తో తెగ ఎంజాయ్ చేసేశాడు. వర్మ చేసిన అల్లరితో అక్కడి వాతావరణం సందడి సందడిగా మారింది.

బీర్లు పొంగించి హీరోయిన్లపై పోస్తూ..

బీర్లు పొంగించి హీరోయిన్లపై పోస్తూ..

ఆ సమయంలో బీర్లు చేతపట్టుకొని హంగామా చేసిన ఆయన హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ లపై పోస్తూ హూషారెత్తించారు. ఛార్మిని కౌగిలించుకొని కంగ్రాట్స్ చెప్పాడు. మునుపెన్నడూ లేనివిధంగా వర్మ చేసిన ఈ హుంగామా చూపరులను ఆశ్చరపర్చింది. పైగా వర్మ చేసిన బీర్ల రచ్చ సోషల్ మీడియా లోనూ వైరల్ అయింది.

పిచ్చోడిని కాదు.. పిచ్చోడిని చేసింది

రామ్ గోపాల్ వర్మ చేసిన రచ్చ రచ్చ తాలూకు వీడియోను సోషల్ మీడియాలోనూ షేర్ చేశాడు. పైగా దానిపై ''నేనేమీ పిచ్చోడిని కాదు.. ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చోడిని చేసింది. కాబట్టి మీరు పూరీని, ఛార్మీనే నిందించాలి'' అంటూ ట్యాగ్ చేసి విలక్షణత చాటుకున్నాడు. అయితే ఈ వీడియోకు వస్తున్న రెస్పాన్స్ చూసిన వర్మ.. మరోసారి దాన్నే ట్యాగ్ చేస్తూ రజినీకాంత్ డైలాగ్ తో రీమిక్స్ చేసి ట్వీట్ చేశాడు.

నీ భార్య రియాక్షన్ చూడు

నీ భార్య రియాక్షన్ చూడు

ఆ వీడియోలో హీరోయిన్లతో ఎంజాయ్ చేయడమే గాక ఛార్మిని కౌగించుకోవడం బాగా హైలైట్ అయింది. దీంతో ఆ క్లిప్పింగ్‌కి చంద్రముఖి సినిమాలో రజినీకాంత్ చెప్పిన డైలాగ్.. ''చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య రియాక్షన్ చూడు'' మిక్స్ చేసి వీడియో పెట్టారు వర్మ. పైగా దీనిపై.. ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ పార్టీ చూశాక సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రియాక్షన్‌ ఇది అని ట్యాగ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

‘ఇస్మార్ట్ శంకర్' మూవీ

‘ఇస్మార్ట్ శంకర్' మూవీ

పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ డూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చిత్రంలో రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్ అభినయం ఆకట్టుకుంటోంది. పూరీ జగన్నాథ్ టేకింగ్ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తోంది. జూలై 18న రిలీజైన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

English summary
Ram Gopal Varma praises Puri Jagannadh on Ismart Shankar succes. He watched movie at Sri Ramulua theate on Friday night. He went on bike along with Directors Ajay Bhupathi, Agasthya Manju. And he enjoyed with heroines, tweeted about Rajinikanth reaction.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more