ఆ అలవాటు మానాలని రజనీకాంత్ రిక్వెస్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్.... తన తోటి నటుడు, ప్రముఖ కన్నడ యాక్టర్ అంబరీష్‌ను పొగతాగడం మానాలంటు రిక్వెస్ట్ చేశారు. ఎన్నో మంచి గుణాలు ఉన్న అంబికి ఆ ఒక్క చెడ్డ గుణం ఉందని, దాన్ని మానాలని ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినడం లేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
ఈ రోజు(మే 31) పొగాకు వ్యతిరేక దినం. రజనీకాంత్ చెప్పింది ఒక్క అంబరీష్ ఒక్కరికనే కాదు....అభిమానులందరికీ అని భావించాలి. పొగ మనిషి జీవితాన్ని హరిస్తుంది. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకు కారణమై నిండు జీవితాన్ని మధ్యలోనే తుంచేస్తుంది. పొగ మానేయడం వల్ల వారి ఒక్కరి జీవితమే కాదు...వారి చుట్టూ తిరేగ వారికి కూడా మేలు చేస్తుంది.
ఈ మధ్య సినిమాల్లో కూడా పొగ తాగడాన్ని నిషేదించారు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి సన్నివేశాలు ఉంచినా....ఆ సీన్లు వచ్చినప్పుడు పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలు వచ్చేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో అలాంటి సన్నివేశాలు దాదాపు లేకుండా పోయాయి.
ఒకప్పుడు రజనీకాంత్ సినిమా అంటే తప్పకుండా పొగతాగడం అనే సన్నివేశాలు ఉండేవి. అయితే రాను రాను మారిన పరిస్థితులు, దాని వల్ల సమాజానికి జరుగుతున్న కీడును గ్రహించిన రజనీ పొగత్రాడాన్ని మానేశారు. సినిమాల్లో కూడా దాదాపుగా అలాంటి సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మీరు కూడా మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం దృష్ట్యా పొగత్రాగడాన్ని ఇకనైనా ఆపేస్తారని ఆశిస్తున్నాం.


Click it and Unblock the Notifications











