twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంకర్ సినిమాలో మా పరిస్థితి ఎలా ఉంటుందంటే.. పూర్తి బాధ్యత అతడితే.. రజనీకాంత్ !

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శంకర్ తన విజన్ తో ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ చిట్టి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో పక్షిరాజు పాత్రలో నటించాడు. అక్షయ్ కుమార్ భయంకరమైన వికృత రూపాల్లో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2.0, శంకర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

     శంకర్ చిత్రాల్లో

    శంకర్ చిత్రాల్లో

    2.0 చిత్రం సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సినిమా. ఈ చిత్రంలో ఆర్టిస్టుల కంటే శంకర్ లాంటి క్రియేటర్స్, టెక్నీషియన్ కే ఎక్కువ పని ఉంటుంది. ఈ చిత్రంలో ఎక్కడ చూసిన శంకర్ విజనే కనిపిస్తుంది. మా చిత్ర యూనిట్ మొత్తం అతడిమీద పూర్తి భరోసాతో ఈ చిత్రాన్ని చేశాం అని రజని అన్నారు. శంకర్ చిత్రాల్లో సిచ్యుయేషన్ ఎలా ఉంటుందంటే.. మా లాంటి వాళ్లకు పెద్దగా పని ఉండదు అని అన్నారు.

     ఇతర దర్శకులతో అయితే

    ఇతర దర్శకులతో అయితే

    ఇతర దర్శకుల చిత్రాల్లో నటించే సమయంలో వారికి మా ఆలోచనలు కూడా అందిస్తాం. మా ఊహలు కూడా సినిమాకు ఉపయోగపడుతాయి. కానీ శంకర్ సినిమాకు వచ్చేసరికి 90 శాతం మూవీ అతడి ఇమాజినేషన్ తోనే పూర్తయిపోతుందని రజని అన్నారు. అయినా కూడా శంకర్ కొన్ని ఆలోచనలని తమతో పంచుకుంటాడని రజని అన్నారు.

    2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్: గ్రాఫిక్స్‌తో ఇంద్రజాలం2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్: గ్రాఫిక్స్‌తో ఇంద్రజాలం

     సులభంగా పోల్చవచ్చు

    సులభంగా పోల్చవచ్చు

    తప్పకుండా 2.0 అనేది ఇండియన్ సినిమాకు గర్వకారణం. ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాలతో సులువుగా పోల్చవచ్చు అని రజని అన్నారు. బడ్జెట్ పరంగా కానీ, సినిమాలో ఉన్న కంటెంట్ పరంగా కానీ ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గదు అని రజని అన్నారు. ఈ చిత్రాన్ని రోబోకు సీక్వెల్ అని కూడా అనలేం. ఎందుకంటే ఈ చిత్రంలో ప్రపంచంలో ప్రధాన సమస్యని చూపించాం అని అన్నారు.

    నా కోసం వస్తారు

    నా కోసం వస్తారు

    అభిమానులు నా చిత్రాలకు వినోదాన్ని ఆశించి వస్తారు. వాళ్ళని ఎంటర్ టైన్ చేయాల్సిన భాద్యత నాది. కానీ నా చిత్రాల్లో కూడా వినోదాన్ని అందిస్తూనే ఉన్న కొద్ది స్పేస్ లో శంకర్ అద్భుతమైన సందేశాన్ని కూడా ఇచ్చారు అని రజని అన్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. త్రీడి ఫార్మాట్ లో రూపొందించిన ఈ చిత్రంలో 4డి సౌండ్ టెక్నాలజీని ఉపయోగించారు.

    English summary
    Rajinikanth reveals why 2.0 is different from all other films in his career. Superstar Rajinikanth opened about 2.0 and why he feels it is a pride of Indian cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X