twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేడా వస్తే నిండా మునిగిపోతారు, ఏందీ పిచ్చి? రోబో 2.0 తెలుగు ఎంతకుకొన్నారో తెలుసా...???

    ఏమో గుర్రం ఎగరావచ్చు అనే టైపులో రజనీకాంత్ సినిమా బ్లాక్ బస్టర్ కావొచ్చంటూ లేటెస్ట్ మూవీ 2.0పై రికార్డు స్థాయిలో బెట్టింగ్ సాగుతోంది.

    |

    రజినీకాంత్ చివరి సినిమా 'కబాలి'ని తెలుగులో దాదాపు రూ.32 కోట్లకు అమ్మారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ ప్రభావం '2.0' మీద ఏమీ పడలేదు. ఎందుకంటే దీని మీద ఉన్న అంచనాలే వేరు. ఇది శంకర్ సినిమా ఆయె. అందులోనూ 'రోబో' తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. '2.0' మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది కూడా 'బాహుబలి: ది కంక్లూజన్' తరహాలోనే ప్రకంపనలు సృష్టిస్తుందని.. అనూహ్యమైన వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

    ఫ్లాప్ వెంచర్

    ఫ్లాప్ వెంచర్

    కబాలి సినిమా తెలుగు హక్కుల కోసం భారీగా ఖర్చుపెట్టారు ఇక్కడి ప్రముఖులు. కానీ టాలీవుడ్ లో ఆ సినిమా ఫ్లాప్ వెంచర్. అంతకంటే ముందొచ్చిన లింగా తెలుగు రైట్స్ ను కూడా ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు.కానీ ఆ మూవీ రిజల్ట్ కూడా సున్నా. రజనీకాంత్ త్రీడీ సినిమా విక్రమసింహ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇన్ని ఎదురు దెబ్బలు, జీవిత కాలానికి సరిపడ అనుభవాలు ఉన్నప్పటికీ.. మరోసారి రజనీకాంత్ సినిమాపై వేలం వెర్రి కనిపిస్తోంది.

    Recommended Video

    Bharathi Raja Vulgar comments on Rajinikanth
    60 కోట్ల రూపాయలకు చేరింది.

    60 కోట్ల రూపాయలకు చేరింది.

    ఏమో గుర్రం ఎగరావచ్చు అనే టైపులో రజనీకాంత్ సినిమా బ్లాక్ బస్టర్ కావొచ్చంటూ లేటెస్ట్ మూవీ 2.0పై రికార్డు స్థాయిలో బెట్టింగ్ సాగుతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం బిడ్డింగ్ 40కోట్ల రూపాయల నుంచి ప్రారంభం కాగా, తాజాగా ఆ లెక్క 60 కోట్ల రూపాయలకు చేరింది.

    బాహుబలి: ది కంక్లూజన్

    బాహుబలి: ది కంక్లూజన్

    ‘బాహుబలి: ది కంక్లూజన్' సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థే శంకర్-రజినీకాంత్‌ల మాగ్నమ్ ఓపస్ ‘2.0'ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతుండటం విశేషం. విడుదలకు ఆరు నెలల ముందే ‘2.0' తెలుగు హక్కుల డీల్ పూర్తయింది.

    గ్లోబల్ సినిమాస్ భాగస్వామ్యంతో

    గ్లోబల్ సినిమాస్ భాగస్వామ్యంతో

    సునీల్ నారంగ్ నేతృత్వంలోని గ్లోబల్ సినిమాస్ భాగస్వామ్యంతో తెలుగులో ‘2.0'ను విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్సన్స్' ప్రకటించింది. భారీ ధరకు ‘2.0'ను అమ్మినట్లు లైకా అధినేత రాజు మహాలింగం ట్విట్టర్లో వెల్లడించాడు. ఆ రేటు ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ఐతే ఈ డీల్ రూ.60 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

    60 కోట్లన్నది భారీగా అనిపించొచ్చు

    60 కోట్లన్నది భారీగా అనిపించొచ్చు

    అందుకే విడుదలకు ఆర్నెల్ల ముందే బిజినెస్ దాదాపుగా పూర్తి కావస్తోందని చెబుతున్నారు. తెలుగు వెర్షన్‌కు రూ.60 కోట్లన్నది భారీగా అనిపించొచ్చు కానీ.. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ఆ మొత్తాన్ని వసూలు చేయడం పెద్ద విషయం కాదు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

    English summary
    Global Cinemas which distributed 'Baahubali: The Conclusion' in Nizam territory acquired the Telugu Theatrical Rights of sci-fi flick '2.0' for a record price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X