ఆశ్చర్యం కలిగించే 'రోబో' బడ్జెట్...ప్రింట్ల వివరాలు
కళానిధి మారన్‌గారు రూ.180 కోట్లతో ఆసియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింన చిత్రం 'రోబో'. తమిళ్, హిందీల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 1న 2,250 ప్రింట్లతో విడుదల కాబోతోంది. తెలుగులో 500లకు పైగా ప్రింట్లతో విడుదల చేస్తున్నాం.ఈ చిత్రంను తెలుగులో విడుదల చేసే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది.ఈ సందర్భంగా సన్ పిక్చర్స్ వారికి ధన్యవాదాలు చెబుతున్నాను'' అని రోబో బడ్జెట్ గురించి చెప్పారు సమర్పకుడు కన్నారావు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ నటించింది. అక్టోబరు 1న మన దేశంతో పాటు యు.ఎస్.ఎ., యు.కె., యూరప్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాల్లోనే కాకుండా ... ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఇటీవల తెలుగులో విడుదలైన ట్రైలర్స్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, కెమెరా: ఆర్.రత్నవేలు, కళ: సాబు సిరిల్, సౌండ్ ఎఫెక్ట్స్: రసూల్ పూకుట్టి, నిర్మాత: కళానిధి మారన్, కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: శంకర్.


Click it and Unblock the Notifications











