రజని రోబో చిత్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నిర్మాతల టాక్ యావరేజికి ఎక్కువ..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో సినిమా యూకెలో విడుదలే నెగిటివ్ టాక్ వినిపించినా, తెలుగులో కోంచెం మాంచి అభిప్రాయాలు రావచ్చని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ లో ఈరోజు మధ్యానానికి ప్రింట్స్ డిస్పాచ్ మొదలవగా ఆల్ రెడీ టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు ఇంతకు ముందే వాళ్శకోసం స్పెషల్ గా ప్రింట్ తెప్పించుకోని షో చూశారంట.
అంతేకాకుండా ఇంకోద్ది సేపట్లో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో మరలా ప్రత్యేకంగా ఇంకోక షో మొదలవబోతుంది. రోబో సినిమాపై స్పందించిన సదరు మన నిర్మాతలు ఈ సినిమా ఫలితాన్ని ఇట్టే తేల్చివేశారు. సినిమా ఫస్టాఫ్ కోంచెం స్లోగా ఉందని, సాంగ్స్ మాత్రం చాలా ఎగస్ట్రా ఆర్డనరీగా ఉన్నాయని అన్నారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే విజువల్స్ సూపర్ గాఉన్నయన్నారు. మొత్తానికి సినిమా యావరేజికి ఎక్కువ హిట్ కితక్కువగా ఉందని వారి మనసులోనే భావాలను వెల్లడించారు.
ఇకపోతే అభిమానులు మొదటినుంచి ఈ సినిమాపై మాంచి ఆశలు పెట్టుకున్నరు కాబట్టి డబ్బులు బగానే వస్తాయన్నారు. ఇక మరి యుకెలో వచ్చినటువంటి నెగిటివ్ టాక్ గురించి ప్రస్తావించగా ఆయా దేశాల్లో లోకల్ సెన్స్రార్ మెంబర్స్ వల్ల పుట్టిందని ఇదంతా రజినికున్న ఇమేజిని దెబ్బతీయాడానికేనని కోట్టిపారేశారు రోబో సినిమా నిర్మాత.


Click it and Unblock the Notifications











