మెగాస్టార్ బర్త్ డేకి సూపర్ స్టార్ సందడి..!?
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్ట్ 22న సూపర్ స్టార్ రజనీ కాంత్ సందడి యేయ్యబోతున్నారు. ఎందుకంటే రజనీ తాజా చిత్రం 'రోబో" ఆగస్ట్ 20న కానీ, 22న కానీ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారము. రజనీకాంత్-ఐశ్వర్య రాయ్ లతో ఎ-1కమర్షియల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తోన్న 'రోబో" 120కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతూ ట్రేడ్ లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకనే ఈ చిత్రం పై నెలకొని వున్న అపరిమిత అంచనాలకు తగ్గట్టుగా హైఎస్ట్ ప్రింట్స్ తో దేశ విదేశాల్లో 'రోబో" ని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో వున్నారు. కాగా ఎఆర్ రహమాన్ సంగీతం సమకూర్చిన 'రోబో" ఆడియో జూలై 18న అటు తమిళ్ లో ఇటు తెలుగులో ఒకే సారి మార్కెట్ లోకి రానుంది..
అయితే 'రోబో" లో పాలిటిక్స్ గురించి రజనీ స్టైల్ లో పలికే పదునైన డైలాగులన్నీ తమిళనాడులో పార్టీ పెట్టి భంగపడ్డ విజయ్ కాంత్ కీ, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టి పరాజయం పాలైన చిరంజీవి కీ తగిలేలా వుంటాయని కోలీవుడ్ న్యూస్. 'రాజకీయాల పై సరైన అవగాహన లేని నాయకులు రాష్ట్రానికి సారధ్యం వహించలేరు. పదవులపై వ్యామోహంతో కాకుండా ప్రజాసేవే ముఖ్యమనుకుంటే దానికి రాజకీయాలు అవసరమే లేదు" అనే ధోరణిలో ఉంటాయని 'రోబో" లో రజనీ రాజకీయ సూక్తులు కొద్దిరోజల క్రితం పలు వెబ్ సైట్ లో దర్శనమిచ్చాయి. మరి సినిమా విడుదలైన తర్వాత మెగా ఫ్యాన్ రివర్స్ అయితే మెగాస్టార్ పుట్టిరోజున రజనికాంత్ పై సినిమా సూక్తులు ఎలావుంటాయో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











